Homelatestబీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు.. పేపర్లన్నీ లీకవుతుంటే ఏం చేశారు?: సిట్ ప్రశ్నల వర్షం.....

బీఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు.. పేపర్లన్నీ లీకవుతుంటే ఏం చేశారు?: సిట్ ప్రశ్నల వర్షం.. లీక్ రాణి రేణుకకు నాంపల్లి కోర్టు షాక్.. పోలీస్ పరీక్షల తేదీలు ప్రకటన.. రేవంత్, బండి సంజయ్ కు షర్మిల ఫోన్.. నేటి టాప్ న్యూస్ ఇవే..

తెలంగాణలో ఆత్మహత్మలే లేవు: కేసీఆర్

తెలంగాణలో రైతు ఆత్మహత్యలే లేవని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ విషయాన్ని తాను గర్వంగా చెప్పగలుగుతానన్నారు. ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ (రైతు సంఘం) నేతలు తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. స్వరాష్ట్రంగా ఏర్పాటు కాకముందు తెలంగాణలో పరిస్థితులు మహారాష్ట్ర కన్నా దారుణంగా ఉండేవని, ఇక్కడ కూడా రైతుల ఆత్మహత్యలు ఉండేవని అన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల సమస్యల పరిష్కారానికి దారి దొరికిందని చెప్పారు.

పేపర్లు లీకవుతుంటే ఏం చేస్తున్నారు?

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ముఖ్యంగా అన్ని పేపర్లు లీక్ అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అంటూ అనితారామచంద్రన్ ను అడిగినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ మీ వద్ద ఎప్పటినుంచి పని చేస్తారు? అతని అధికారులు ఏంటన్న అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

‘రమేష్ ఎప్పటి నుంచి తెలుసు?’

టీఎస్పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డిని ‘‘గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితునిగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ రమేశ్‌ మీకు ఎంతకాలంగా తెలుసు? రమేశ్‌నే మీరు పీఏగా పెట్టుకోవడానికి కారణమేంటి? ఏ నిబంధనల ప్రకారం అన్ని ఎంచుకున్నారు? పేపర్ల లీకేజీ గురించి మీకు తెలుసా? రమేశ్‌కు ప్రశ్నపత్రం రావడానికి మీరేమైనా సహకారం అందించారా? కమిటీ సభ్యుడిగా టీఎస్పీఎస్సీలో మీరు ఎలాంటి విధులు నిర్వహిస్తారు?’’ అంటూ పలు కోణాల్లో లింగారెడ్డిని విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు.

రేణుక బెయిల్ పటిషన్ తిరస్కరణ

పేపర్‌ లీకేజీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితురాలు రేణుక బెయిల్‌ కోసం వేసిన పిటిషన్‌ను శనివారం నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఏఈ పేపర్‌ లీకేజీతో సంబంధం ఉండి అరెస్టయిన మరో ముగ్గురు నిందితులు ప్రశాంత్‌, రాజేందర్‌, తిరుపతయ్యలను వారం రోజులు పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నిర్ణయాన్ని వెలువరించనుంది. ఇప్పటికే సిట్‌ కస్టడీలో ఉన్న టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమే్‌షలతో పాటు మాజీ ఉద్యోగి సురేష్ పోలీస్‌ కస్టడీ ఆదివారంతో ముగియనుంది. ఆదివారం సాయంత్రం వారిని సిట్‌ అధికారులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.

8, 9 తేదీల్లో ఎస్ఐ పోలీస్ నియామక పరీక్ష

తెలంగాణలో పోలీస్ నియామకాలు తుది దశకు చేరాయి. ఈ నెల 8,9 తేదీల్లో ఎస్ఐ తుది పరీక్షలను నియమించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు తమ హాల్ టికెట్లను https://www.tslprb.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.

జూన్ 1 నుంచి ఇంటర్ కాలేజీలు

తెలంగాణలో ఇంటర్ కాలేజీలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. సెకండియర్ ఇయర్ తరగతులు ఆ రోజు నుంచి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది. అయితే.. ఫస్ట్ ఇయర్ కు సంబంధించి మాత్రం బోర్డు క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం 227 రోజుల పాటు తరగతులు ఉంటాయని వెల్లడించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

ప్రభుత్వాన్ని వదిలిపెట్టం: బండి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో తన కొడుకు ఉన్నాడనే సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని ఆరోపించారు. బిడ్డ లిక్కర్ కేసుపైనా సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్ ను సీఎం కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ వెనుక బీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి, బండికి షర్మిల ఫోన్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై కలిసి పోరాడుదామని వారిని షర్మిల కోరినట్లు తెలుస్తుంది. ఉమ్మడి కార్యచరణ చేపడదామని..ప్రగతిభవన్ మార్చ్ కూడా పిలుపునిద్దామని వారికి షర్మిల సూచించినట్లు సమాచారం. అయితే దీనికి త్వరలో సమావేశం అవుదామని బండి సంజయ్ చెప్పగా..పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది.

నేడు టీపీసీసీ విస్తృత సమావేశం

ఏఐసీసీ తలపెట్టిన జై భారత్‌ సత్యాగ్రహ దీక్షలకు రాష్ట్రస్థాయిలో కార్యాచరణ రూపొందించేందుకు ఆదివారం గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత కార్యవర్గం సమావేశం కానుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc