Homelatestబీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం.. సీనియర్ నటి కన్నుమూత.. బండి సంజయ్ కుమారుడికి పోలీసుల...

బీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం.. సీనియర్ నటి కన్నుమూత.. బండి సంజయ్ కుమారుడికి పోలీసుల నోటీసులు.. 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

బీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం:


బిఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేండ్లలో దేశమంతటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇంకా.. ‘‘వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ ఇస్తాం. దేశంలోని రైతులకు కిసాన్ బంధు, ఏటా 20 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తాం. శుద్ధి చేసిన నీరును తెలంగాణ మాదిరే దేశవ్యాప్తంగా అందిస్తాం’’. అని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తో పాటు ఇతర ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఒడిషా మాజీ ముఖ్యమంత్రి, అగ్రనేత, రాజకీయ భీష్మాచార్యుడు గిరిదర్ గమాంగ్, వారి శ్రీమతి హేమ గమాంగ్, వారి కుమారులు శిశిర్ గమాంగ్ తదితర నాయకులందరినీ స్వాగతిస్తూ, అభినందిస్తున్నానని కేసీఆర్ అన్నారు.

నటి జమున కన్నుమూత


వెండితెరపై సత్యభామగా అందరిని మెప్పించిన.. సీనియర్ నటి జమున కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జమున బంజారాహిల్స్ తోని తన నివాశంలో శుక్రవరాం ఉదయం కన్నుమూశారు. జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం 4.05 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు జరిగాయి. జమున కూతురు చితికి నిప్పంటించారు.

నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం


తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాద యాత్ర ప్రారంభమైంది. యువగళం పేరుతో చిత్తూరు జిల్లాలోని టీడీపీ కంచుకోట కుప్పం నుంచి శుక్రవారం పాదయాత్రను ప్రారంభించారు. నేటి నుంచి నాలుగు వందల రోజుల పాటు.. నాలుగు వేల కిలోమీటర్ల మేర ఆయన పాద యాత్ర కొనసాగనుంది. తెలిరోజు ఆయన పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు.

హీరో తారకరత్న పరిస్థితి విషమం?


టీడీపీ యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర తొలిరోజే అపశృతి చోటు చేసుకుంది. ఆ పార్టీ నేత, సినీ హీరో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కేఈసీ మెడికల్ కాలేజీకి తరలించగా.. గుండె పోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో స్టంట్ వేశారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరో 2,391 కొత్త కొలువులు


రాష్ట్ర ప్రభుత్వం మరో 2,391 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. గురుకులాలు, సమాచార పౌరసంబధాలశాఖలో వివిధ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంత్రి హరీశ్ రావు ప్రకటన విడుదల చేశారు. బీసీ గురుకుల విద్యాలయాల్లో 1499 పోస్టులను గురుకులాల నియామక మండలి ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 480 లెక్చరర్లు, 324 టీజీటీ, 235 పీజీటీ, 185 జూనియర్‌ లెక్చరర్‌, 60 ల్యాబ్‌ అసిస్టెంట్‌, 37 లైబ్రేరియన్‌, 33 ఆర్ట్‌-క్రాఫ్ట్-మ్యూజిక్‌ టీచర్‌, 30 కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, 33 పీఈటీ, 10 ప్రిన్సిపల్‌ పోస్టులు ఉన్నాయి. మరో 63 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ నియామకమండలి ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో గ్రూప్‌-3, గ్రూప్‌-4 కింద 12 చొప్పున జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 417 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో 87 టీజీటీ, 6 ఆర్ట్‌-క్రాఫ్ట్‌-మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులను గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులను పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు.

తపాలా శాఖలో 40 వేలకు పైగా ఉద్యోగాలు


తపాలా శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో మొత్తం 40,889 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ అర్హతపై పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్/ డాక్‌ సేవక్‌ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

సగం మంది టీచర్లు బదిలీ?

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియలో దాదాపు సగం మంది టీచర్లు బదిలీ కానున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.04 లక్షల మంది టీచర్లు పని చేస్తుండగా.. ఇందులో 50 వేల మంది బదిలీ అవుతారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వారంత తిరిగి రావాలన్న బండి


బీజీపీ సైద్ధాంతిక భావజాలన్ని కలిగి ఉండి.. చిన్న చిన్న కారణాలతో పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య తెలంగాణను సాధించుకుందామన్నారు. మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 2 నుంచి షర్మిల యాత్ర


తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రను ఫిబ్రవరి 2 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి పాదయాత్రకు అనుమతి కోరగా వరంగల్ పోలీసులు నిరాకరించినట్లు చెప్పారు. తాజాగా 15 షరతులతో అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు.

బండి సంజయ్ కుమారుడికి నోటీసులు


బండి సంజయ్ కుమారుడు భగీరధ్ కు దుండిగల్ పోలీసులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అసభ్య పదజాలంతో తోటి విద్యార్థిని దూషించిన కేసులో ఆయనకు ఈ నోటీసులు జారీ చేశారు. అతను చదువుకునే యూనివర్సిటీ స్టూడెంట్ ఎఫైర్స్ చీఫ్ కో ఆర్డినేటర్ సుఖేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc