ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సంచలన లేఖ.. హరీశ్ Vs గవర్నర్.. ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి ఫైర్.. అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. చంపేస్తారంటూ కాంగ్రెస్ నేతకు కోమటిరెడ్డి వార్నింగ్.. డెడ్ బాడీకి ట్రీట్మెంట్: బండి సంజయ్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

మోదీకి విపక్ష నేతల లేఖ

కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలుగా మారాయని సీఎం కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, మమతాబెనర్జీ, శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్ తదితర దేశంలోని 9 మంది విపక్ష లేఖలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాజ్ భవన్ లుసైతం అలాగే తయారయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలపైకి వీటిని ఉసిగొల్పడం సరికాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎంను అరెస్ట్ చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని హరీశ్‌రావు ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా తెలంగాణకు ఒక్క కాలేజీ కూడా కేటాయించలేదని విమర్శలు గుప్పించారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహారిస్తోందని ఫైర్ అయ్యారు. దేశంలోని ప్రతి లక్ష మందికి 19 ఎంబీబీఎస్‌ సీట్లతో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంతో రాష్ట్ర నిధులతో సీఎం కేసీఆర్‌ 12 కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే కేంద్రం మాత్రం తెలంగాణపై వివక్ష చూపిస్తుందంటూ మండిపడ్డారు.

ప్రభుత్వంపై తమిళిసై వాఖ్యలు

గవర్నర్ తమిళిసై మరో సారి తెలంగాణ సర్కార్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రం పీఎంఎస్ఎస్వై కింద కొత్త మెడికల్ కాలేజీలకు దరఖాస్తు చేసుకుందన్నారు. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం ఇందులో విఫలమైందన్నారు. వైద్యకళాశాలలను అడగడంలో ఆలస్యం చేసిందన్నారు. తమిళనాడు ఒక్క ఏడాదిలోనే 11 మెడికల్ కాలేజీలను పొందిందన్నారు. ట్విట్టర్ లో తెలంగాణకు ఎన్నిక మెడికల్ కాలేజీలను కేంద్రం ఇచ్చిందని.. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు గవర్నర్ ఈ విధంగా స్పందించారు.

కేసీఆర్ పై పొంగులేటి డైరెక్ట్ అటాక్

బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని వాఖ్యలు చేశారు. జెండా ఏదైనా కేసీఆర్‌ను గద్దె దింపడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలను ఇంటికి పంపించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదివారం పాలేరు నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలతో తిరుమలాయపాలెంలో ఆదివారం ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ చెప్పేదొకటి.. చేసేదొకటి అని విమర్శించారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంలో ఆయన ముందుంటారన్నారు.

కానిస్టేబుల్ ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో ఓ మహిళా కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్ర కారం.. నగరంలోని 25వ డివిజన్‌ వేణురావు కాలనీకి చెంది న ఎదులాపురం మౌనిక (28) మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా భర్త శ్రీధర్‌ వేధింపులు తాళలేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌనిక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు అనుమానాస్పద మృతిగా మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతిరాలి భర్త, బావ, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మౌనికను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వివాదంలో కోమటిరెడ్డి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ సీనియర్ నేత చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ నాన్న నా మీద వాఖ్యలు చేస్తున్నాడు. ఆయనను చంపడానికి నా అనుచరులు 100 కార్లలో తిరుగుతున్నారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నీ హాస్పటల్ ను సైతం కూల్చేస్తారంటూ బెదిరించాడు. మీ నాన్న బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పకపోతే చంపేయడం ఖాయమని వార్నింగ్ ఇచ్చాడు.

ఇంకాన్నాళ్లు వీరి పెత్తానం?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలంతో.. తన కుమారుడికి ఫోన్ చేసి.. తిట్టడం, చంపేస్తామంటూ వార్నింగ్ ఇవ్వటం ఆశ్చర్యం కలిగించిందని చెరుకు సుధాకర్ అన్నారు. తాను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్ క్యాంపెనర్‌గా ఒకే పార్టీలో పని చేస్తున్న విషయం మరిచి.. తనపై ఆ భాష ఏమిటో అర్థం కావట్లేదన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరినీ కామెంట్ చేయలేదన్న సుధాకర్.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదిగా చెప్తోన్న ఆ కాల్ రికార్డింగ్‌ను.. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపించానని తెలిపారు. ఇలాంటి వాళ్ల పెత్తనం పార్టీలో ఎన్ని రోజులు కొనసాగుతుందో అనేది ప్రశ్నార్థకంగా మారిందని చెరుకు సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here