Homelatestవిచారణకు రాను: ఈడీకి కవిత షాక్.. మళ్లీ 20న రావాల్సిందేనని ఈడీ నోటీసులు.. తెలంగాణ ఎమ్మెల్సీ...

విచారణకు రాను: ఈడీకి కవిత షాక్.. మళ్లీ 20న రావాల్సిందేనని ఈడీ నోటీసులు.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం.. పేపర్ లీకేజీ విచారణలో సంచలన విషయాలు.. హైదరాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో భారీ అగ్నిప్రమాదం: 6 గురి మృతి.. నేటి టాప్ టెన్ న్యూస్..

విచారణకు రాను: ఈడీకి కవిత లేఖ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కు షాకిచ్చారు. నిన్న ఉదయం 11.30 నిమిషాలకు ఆమె విచారణకు హాజరుకవాల్సి ఉంది. కానీ, తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాశారు. విచారణ విషయంలో మహిళనైన తన పట్ల ఈడీ వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూ ఏకంగా లేఖాస్త్రాన్ని సంధించారు. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ తాజా సమన్లలో ఎక్కడా తెలపలేదని లేఖలో పేర్కొన్నారు. ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిపించడాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఈ నెల 24న తన కేసు విచారణకు స్వీకరించే వరకు వేచి చూడాలన్నారు. ఏమైనా సమాచారం కావాలంటే తన అధికారిక ప్రతినిధికి చెప్పాలని సూచించారు. లేకపోతే తనకు ఈ-మెయిల్‌ ద్వారా సమచారం అందించాలన్నారు.

ఈ నెల 20న రావాలని కవితకు నోటీసులు

కవిత లేఖపై ఈడీ సైతం తీవ్రంగానే రియాక్ట్ అయ్యింది. ఈ నెల 20న ఈడీ విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో మరో నిందితుడు రామచంద్ర పిళ్లై కస్టడీ పిటీషన్ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత నిందితురాలా లేక అనుమనితురాలా అంటూ ఈడీని కోర్టు ప్రశ్నించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత నిందితురాలు కాదు.. కేవలం అనుమనితురాలే మాత్రమే అంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలపడం గమనార్హం.

అగ్నిప్రమాదంలో ఆరుగురి మృతి

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కాల్‌ సెంటర్‌లో పని చేస్తున్న వారు మంటలు చెలరేగిన సందర్భంగా ఓ గదిలో దాక్కున్నారు. మంటల తీవ్రతతో పాటు పొగకు ఉక్కిరిబిక్కిరైన వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది భవనాన్ని తనిఖీ చేస్తుండగా ఓ గదిలో ఆరుగురు స్పృహ కోల్పోయి ఉండటన్ని గుర్తించారు. వారికి సిపిఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మృతి చెందిన వారిని వెన్నెల, ప్రమీల, త్రివేణి, శ్రావణి, శివ, ప్రశాంత్ గా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు వరంగల్‌ జిల్లా, ఇద్దరు ఖమ్మం జిల్లా, ఒకరు మహబూబాబాద్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

మరొకరిని ప్రేమిస్తున్నాడని స్నేహితురాలి హత్య

మంచిర్యాలకు చెందిన మహేశ్వరి, అంజలి ఇద్దరు యువతులు ప్రేమించుకొని గత కొన్ని రోజులుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఒక రూం అద్దెకు తీసుకుని సహ జీవనం చేస్తున్నారు. కానీ, ఏమైందో తెలియదు కానీ, వీరిద్దరు స్థానిక రామకృష్ణా పూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో కనిపించారు. తీవ్ర గాయాలతో ఉన్న యువతి అంజలి, ట్రాన్స్‌జెండర్ మహేశ్వరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అంజలి మృతి చెందింది. ట్రాన్స్‌జెండర్ అయిన మహేశ్వరి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ఓ వ్యక్తితో అంజలి సన్నిహితంగా ఉంటూ మహేశ్వరిని దూరం పెట్టడంతోనే అంజలిని మహేశ్వరి హత్య చేసిందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డెడ్ లైన్

గ్రూప్-1 పరీక్ష పేపర్ సైతం వివిధ చోట్ల లీకైందని తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాఖ్యానించారు. ఈ పరీక్షను రద్దు చేయకుంటే మరో 12 గంటల తర్వాత తాను ఆమరణ దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో తెలంగాణలోని 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీకి బాధ్యత వహించి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ చేస్తున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసులో కీలక నిందితుడైన ప్రవీణ్ నుంచి స్వాధీనం చేసుకున్న 4 పెన్ డ్రైవ్ లలో మొత్తం 60 జీబీ డేటా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఇంకా అనేక ప్రశ్నాపత్రాలు సైతం లీకయ్యాయని సిట్ గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. లక్షల మంది అభ్యర్థులతో ఈ అంశం ముడిపడి ఉండడంతో సిట్ ఆ అంశంపై ఆచితూచి ముందుకు సాగుతోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికల ప్రక్రియ పూర్తి. రిటర్నింగ్ అధికారి నుంచి ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కె. నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక ధ్రువీకరణ పత్రం స్వీకరణ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు.

బీజేపీ అభ్యర్థి విజయం:

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి 1,150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. గురువారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటలకు కౌంటింగ్ పూర్తయింది.

కేటీఆర్ కు రేవంత్ కౌంటర్

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే ఈ రోజు పదవులు అనుభవిస్తున్న టీఆర్ఎస్ నేతలు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం కామారెడ్డి జిల్లా పిట్లంలో మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందని కేటీఆర్‌ అడుగుతున్నాన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రతీ ప్రాజెక్టు కాంగ్రెస్‌ కట్టిందేనన్నారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి నుంచి బోధన్‌ వరకు రేవంత్‌ రెడ్డి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పాదయాత్ర నిర్వహించారు. రాత్రి బోధన్‌లో సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్‌, దేశంలో మోదీ కులాలు, మతం పేరుతో ప్రజలను విభజించి పాలించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో భారీ వర్షాలు:

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురవడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. పలు చోట్ల పంట నష్టం జరిగింది. మహబూబాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, మెదక్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మేడ్చల్‌, ములుగు, భూపాలపల్లి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో అత్యధికంగా 4.60 సెం.మీ వర్షపాతం నమోదైంది. మర్పల్లి, కోటమర్పల్లి, పంచలింగాల్‌, ఎన్కెపల్లి, ఉమ్మడి ఖమ్మం జిల్లా చర్ల, వైరా, చింతకాని, మధిర, బోనకల్‌, రఘునాథపాలెం, కొణిజర్ల మండలాల్లో భారీగా పంటనష్టం జరిగింది. భూపాలపల్లి రూరల్‌ మండలం కాటారం, చిట్యాల, మహబూబాబాద్‌ జిల్లా గార్లలో మిర్చి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. భూపాలపల్లి జిల్లాలో 12వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు. గద్వాల జిల్లా చెన్నిపాడు, మానవపాడులో ఆరబెట్టిన మిర్చి పంట తడిపోయింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో తూకానికి ఉంచిన వేరుశనగ పంట కొట్టుకుపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc