Homelatestగ్రూప్-1తో పాటు మరో 2 ఎగ్జామ్స్ రద్దు.. తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రకటించిన...

గ్రూప్-1తో పాటు మరో 2 ఎగ్జామ్స్ రద్దు.. తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్ ప్రకటించిన కేంద్రం.. రామ్ చరణ్ కు అమిత్ షా అభినందన.. అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం.. పేపర్ లీకేజీపై భగ్గుమన్న ప్రతిపక్షాలు.. నేటి టాప్ న్యూస్ ఇవే..

గ్రూప్-1 రద్దు

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దుకు కారణమైంది. గ్రూప్-1తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ నిన్న ప్రకటన విడుదల చేసింది. రద్దు చేసిన గ్రూప్-1 పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.

తెలంగాణకు మెగా టెక్స్ టైల్ పార్క్

తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మెగా టెక్స్‌టైల్‌ పార్కులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. పీఎం మిత్ర పథకంలో భాగంగా ఈ పార్కులను ఇస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కులను ఏర్పాటు చేయన్నుట్లు ప్రధాని మోదీ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ పార్కులతో రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని.. మేకిన్‌ ఇండియాకు ఇదో గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. 13 రాష్ట్రాల నుంచి 18 ప్రతిపాదనలు అందాయని, అందులో ఏడింటిని ఎంపిక చేశామని కేంద్ర జౌళి శాఖ తెలిపింది. కనెక్టివిటీ, ఎకోసిస్టమ్‌, టెక్స్‌టైల్‌ విధానం, మౌలిక సదుపాయాలు, ఇతర సేవలను పరిగణనలోకి తీసుకొని పార్కులను ఏర్పాటు చేసే ప్రాంతాలను ఎంపిక చేశామని వివరించింది.

సిట్టింగ్ జడ్జితో విచారణకు బండి సంజయ్ డిమాండ్

టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ ప్రభుత్వ పెద్దల అండదండలతోనే జరిగిందని ఆరోపించారు. పేపర్ లీకేజీపై గన్ పార్క్ వద్ద బీజేపీ నిన్న ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని: కేటీఆర్

బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుట్ర బీజేపీదేనని ఆరోపించారు. రాజ్యంగబద్ధంగా ఏర్పడిన సంస్థ టీఎస్పీఎస్సీ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఈ సంస్థలో ప్రభుత్వ ప్రమేయం పరిమితమేనన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నే రద్దు చేయాలనడం సరికాదాన్నారు. ఇందులో యువతను ఉద్యోగాలకు దూరం చేయాలనే కుట్ర దాగి ఉందన్నారు.

కేటీఆర్ ను భర్తరఫ్ చేయాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితులుగా వున్న వారికి బీజేపీతో పాటు మీతోనూ రాజకీయ సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారన్నారు. పేపర్ లీకేజ్ విషయంలో టెక్నికల్ అంశాలు ఉన్నందున.. ఈ శాఖకు మంత్రిగా వున్న కేటీఆర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇంత జరిగినా నేటి వరకు కమీషన్ ఛైర్మన్, సభ్యులపై ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కనీసం ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ సమీక్ష కూడా చేయలేదని.. టీఎస్‌పీఎస్‌సీ బోర్డుపై చర్యలు తీసుకుని, ఐటీ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రామ్ చరణ్ కు అమిత్ షా అభినందన

భారతీయ చలనచిత్ర రంగం లో ఇద్దరు లెజెండ్స్ ను (మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్) కలవడం ఆనందం గా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ భారత దేశ సంస్కృతి మరియు ఆర్ధిక వ్యవస్థ ను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు మరియు RRR మూవీ చిత్రం విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను ఈ మేరకు అభినందించారు అమిత్ షా. వీటితో పాటుగా చిరు మరియు చరణ్ లతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

ఇదేనా బంగారు తెలంగాణ: షర్మిల ఫైర్

ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం టీఎస్‌ పీఎస్‌సీ దగ్గర ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తర్వాత హౌజ్ అరెస్ట్ చేసి ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని ధ్వజమెత్తారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. దీని కోసమేనా విద్యార్థులు, ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్నదని కేసీఆర్ ను నిలదీశారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకైతే కేబినెట్ సమావేశం పెట్టని కేసీఆర్..బిడ్డ కవిత లిక్కర్ స్కాంలో దొరికితే మాత్రం హుటాహుటిన కేబినెట్ సమావేశం నిర్వహించారని మండిపడ్డారు.

అగ్నిప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం


సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించినవారికి రూ. లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి శ్రీ మహమూద్ అలీ, మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc