మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోయే చిత్రం అంతకుమించి ఉండాలని ప్రేక్షకులు భావించారు. చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ఆరెంజ్… రామ్ చరణ్ బాబాయ్ నాగబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రేమ కొంతకాలమే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా అలరించలేదు. నిర్మాత నాగబాబుకి భారీ నష్టాలనే మిగిల్చింది ఈ చిత్రం. ఒకానొక టైంలో సూసైడ్ చేసుకోవాలని నాగబాబు అనుకున్నారు. కానీ అతని సోదరులు చిరంజీవి , పవన్ కళ్యాణ్ అండగా నిలబడడంతో ఆరెంజ్ సినిమా మిగిల్చిన కష్టాల నుంచి నాగబాబు బయటపడ్డారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు విడుదలై ఉంటే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకునేదని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ఇంతకీ ఈ సినిమా ప్లాప్ కావడానికి కారణాలు ఏంటి ఒకసారి చూద్దాం.
ఆరెంజ్ చిత్రం కంటే ముందుగా మగధీర చిత్రం రావడం ఈ సినిమాకు బిగ్గెస్ట్ మైనస్.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఆరెంజ్ ప్రేక్షకులను ఏమాత్రం కూడా అప్పుడు అలరించలేకపోయింది.
ప్రేమ కొంతకాలమే బాగుంటుందనే కాన్సెప్ట్ ని ప్రేక్షకులు ఆదరిస్తారని బొమ్మరిల్లు భాస్కర్ అనుకున్నారు కానీ చాలా లైట్ తీసుకున్నారు. సినిమా అడ్వాన్సు లెవెల్ లో ఉండడం ఈ సినిమాకు మరో మైనస్.
బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా మెప్పించిన జెనీలియా ఈ సినిమాలో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సినిమా టైటిల్ చాలామందికి అర్థం కాక, అసలు ఈ కథకి టైటిల్ కి ఏంటి సంబంధం తెలియక చాలా మంది సినిమాను చూడలేదు.
డిఫరెంట్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన స్క్రీన్ ప్లేస్ సరిగా కుదరకపోవడం వల్ల ఈ సినిమా ప్లాప్ అయిందని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ స్వయంగా ఒప్పుకోవడం మరో విశేషం.
సినిమా రిలీజ్ డేట్ కూడా ఈ సినిమాకు మైనస్ అని సినీ విశ్లేషకులు చెబుతారు.