ఎముకలపై థైరాయిడ్ ఎఫెక్ట్.. హైపర్ థైరాయిడిజం అంటే ఏమిటంటే..

థైరాయిడ్ అంటే హైపర్ థైరాయిడిజం అని అర్థం. ఇది శరీరంలోని థైరాయిడ్ గ్రంధి.. థైరాయిడ్ హార్మోన్లను అధికంగా ఉత్పత్తి చేసినప్పుడు జరుగుతుంది. ఇది శరీరం యొక్క జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా ఆకస్మిక బరువు తగ్గడం లేదా పెరగడం లాంటి ఇతర సంకేతాలకు దారితీస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే హృదయ స్పందన, స్పైక్ రక్తపోటు, సంబంధిత గుండె సమస్యలు, వంధ్యత్వ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాదు, ఇది దృష్టి సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఎముక ఆరోగ్యం

హైపర్ థైరాయిడిజం వల్ల చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఇది ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఓవర్యాక్టివ్ థైరాయిడ్ మీ జీవక్రియను వేగవంతం చేయడమే కాకుండా ఎముక ఖనిజ సాంద్రత కోల్పోయే రేటును పెంచుతుంది. ఈ పెరిగిన రేటు కొత్త ఎముకలను నిర్మించడాన్ని శరీరానికి కష్టతరం చేస్తుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. బోలు ఎముకల వ్యాధి అనేది ఒక నిశ్శబ్ద వ్యాధి, ఇది ఎటువంటి స్పష్టమైన సంకేతాలు కనిపించకుండా వ్యాపిస్తుంది. థైరాయిడ్ ఫలితంగా తరచుగా ఎముక సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల ఎముక పగుళ్లకు దారి తీస్తుంది. ఒకానొక సమయంలో ఎముకలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

హైపర్ థైరాయిడిజం సంకేతాలను ముందే గమనించాలి. ఈ వ్యాధి బారిన పడిన వారు బరువు తగ్గడమే కాకుండా, ఆందోళన, చంచలత్వం, చిరాకు, వేడికి సున్నితత్వం, దడ, బలహీనత, చేతులు వణుకడం, నిద్ర సమస్యలు లాంటివి చూడవచ్చు. కొన్నిసార్లు హైపర్ థైరాయిడిజం ఫలితంగా గాయిటర్‌ వ్యాధి కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. వారి మెడ అడుగుభాగంలో వాపు ఉంటుంది. చర్మం సన్నబడటం, పెళుసుగా ఉండే జుట్టు కూడా కొన్ని లక్షణాలుగా చెప్పవచ్చు. వృద్ధుల్లో కొన్నిసార్లు ఈ సంకేతాలను గుర్తించడం కష్టంగా ఉంటుందని, అందువల్ల రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి సంకేతాలను గనక గమనించినట్లయితే, డాక్టర్‌తో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. వెంటనే పరీక్షించుకోండి అని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి నిర్థారణకు సాధారణ రక్త పరీక్షఅవసరం. దీంతో పాటు T4, T3 పరీక్షల ద్వారానూ మీకు హైపర్ థైరాయిడిజం ఉందో లేదో తెలుస్తుంది.

ఒకవేళ వ్యాధి నిర్థారణ అయితే మెగ్నీషియం, జింక్, కాపర్ , ఐరన్ వంటి ఇతర సప్లిమెంట్లతో పాటు కాల్షియం, విటమిన్ డి 3 ట్యాబెట్లను వైద్యులు సూచించే అవకాశం ఉంది. కానీ బయోటిన్ ఖచ్చితమైన పరీక్ష ఫలితాలను ఇవ్వకపోవచ్చు

థైరాయిడ్ రక్త పరీక్షలు బయోటిన్ తీసుకునేవారిలో తప్పుడు ఫలితాలను ఇస్తాయని చాలా మందికి తెలియదు. చాలా మంది మంచి జుట్టు, గోళ్ల కోసం సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా సార్లు ఇది మల్టీవిటమిన్లు తీసుకునే వారిలోనూ కనిపిస్తుంది. కాబట్టి మీరు బయోటిన్‌ని ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నట్టయితే ఆ విషయాన్ని వెంటనే మీ వైద్యుడికి తెలియజేయండి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here