బీఆర్ఎస్ పై కేసీఆర్ కొత్త వ్యూహం ఇదే.. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. పోలీస్ అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పోరాటం.. సంక్రాంతికి 94 స్పెషల్ ట్రైన్లు.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

ఆ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ప్లాన్

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) విస్తరణపై ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర , కర్నాటక , ఛత్తీస్‌గఢ్‌ తో పాటు ఒడిశా , గుజరాత్‌ లో పార్టీ విస్తరణ గురించి సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారిచినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాల్లో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దించేందకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉండే తెలుగు వారికి వివరాలను సేకరించడంతో పాటు అభ్యర్థుల అన్వేషణలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి మొదటి వారంలో మహారాష్ట్రలోని నాందేడ్ లేదా అమరావతిలో బీఆర్ఎస్ కిసాన్ సభ నిర్వహించాలని కేసీఆర్​ భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్​ ఢిల్లీ టూర్ తో పాటు ఆరు రాష్ట్రాల పర్యటనపై నేడో రేపో స్పష్టత రానుంది.

అమరుల త్యాగాలతో తెలంగాణకు విముక్తి


నిజాం పాలనలో అణిచివేతకు గురైన ప్రజల కోసం అమరులు చేసిన త్యాగాలతోనే తెలంగాణకు విముక్తి లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. హైదరాబాద్ లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మంగళవారం నిర్వహించిన లిబరేషన్ ఆఫ్ నిజాం ప్రావిన్స్ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామాగా మిగిలిందన్నారు. కరోనాతో పేరెంట్స్ ను కోల్పోయిన విద్యార్థులకు కేశవ్ విద్యాసంస్థలు ఉచితంగా విద్యను అందించడం అభినందనీయమన్నారు.

నేటి నుంచి రైతు బంధు


రైతు బంధు పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి బుధవారం నుంచి నగదును జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మొత్తం 70.54 లక్షల మంది ఖాతాల్లో రూ.7,676.61 కోట్లను జమ చేయనున్నట్లు చెప్పారు. మొదటి రోజును ఎకరా వరకు భూమి కలిగిన రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున, గురువారం రూ.2 ఎకరాల్లోపు వారికి, మూడు రోజు 3, నాలుగో రోజు 4 ఇలా ప్రతీ రోజు ఎకరా చొప్పున విస్తీర్ణం పెంచుతూ నిధులు జమ చేయనున్నట్లు చెప్పారు.

కరోనాపై మాక్ డ్రిల్


ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో ఏ పరిస్థితి తలెత్తినా తట్టుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రభత్వ, ప్రవైటు ఆస్పత్రుల్లో మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ ఆరోగ్య వసతులు, ఐసోలేషన్ బెడ్లు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ వెంటిలేటర్ బెడ్లు, అంబులెన్స్ లు, పరీక్షా పరికరాలు, మందులపై సన్నద్ధతను అధికారులు పరీక్షించారు.

తెలంగాణలో 28 వేల బెడ్లు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 28 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా సన్నద్ధత కోసం మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1800 వెంటిలెటర్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. సరిపడా మందులు, పరికరాలు ఉన్నాయమన్నారు. ఇదిలా అుంటే రాష్ట్రంలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్ లో 2 నమోదు కాగా.. నారాయణపేట జిల్లాలో 1, పెద్దపల్లిలో 2 కేసులు నమోదయ్యాయి.

బీజేపీ నేతల ముసుగులు తొలిగాయి: కేటీఆర్


దొంగల ముసుగులు తొలిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనడంపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్‌ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌ అయ్యిందని ఆరోపించారు. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారని విమర్శించారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటని ప్రశ్నించారు. దొంగలకు నార్కో అనాలిసిస్‌, లై డిటెక్టర్‌ టెస్టులకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. ఆపరేషన్‌ లోటస్‌ బెడిసికొట్టి అడ్డంగా దొరికారని.. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరని అన్నారు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

అందుకోసమే విచారణ: పైలెట్ రోహిత్ రెడ్డి


వ్యక్తిగత, కుటుంబ తన ప్రైవేటు సమాచారాన్ని రాబట్టుకోవడం కోసమే ఈడీ తనను విచారిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎలాంటి వివరాలు చెప్పకుండా ఈడీ అధికారులు ఈ నెల 19న హాజరుకావాలంటూ సమాన్లు జారీ చేశారని పిటాషన్లో పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారం కోసమే తనను విచారిస్తున్నట్లు ఈ నెల 19న జరిగిన విచారణలో అనిపించిందన్నారు. తాను చెప్పిన సమాధానాలను నమోదు చేయడం లేదన్నారు. తనపై దురుద్దేశపూర్వకంగా జరిగిన కేసును కొట్టివేయాలని కోరారు.

సంక్రాంతికి 94 స్పెషల్ ట్రైన్లు:


సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శభవార్త చెప్పింది. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు మొత్తం 94 స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం-కర్నూల్, కాకినాడ టౌన్-లింగంపల్లి, మచిలీపట్నం-సికింద్రాబాద్, మచిలీపట్నం-తిరుపతి తో పాటు పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే.

పోలీస్ ఈవెంట్స్ లో వారికి మినహాయింపు:


తెలంగాణలో పోలీస్ నియాకాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్ లో గర్భిణులకు మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. వారు తుది రాత పరీక్షలో నేరుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. అయితే.. ఫలితాలు వచ్చిన నెల రోజుల్లో వారు అర్హత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు TSLPRB చైర్మన్ శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు.

పోలీస్ అభ్యర్థులకు మార్కులు కలపాలని కాంగ్రెస్ డిమాండ్:

ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి టీఎస్పీఆర్బీలో జరిగి అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం అభ్యర్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పోలీస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన సమర దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు మల్లు రవి పాల్గొని మాట్లాడారు. హైకోర్టు తీర్పు ప్రకారం అభ్యర్థులకు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here