దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు.. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వమే: ప్రముఖ సర్వే.. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీగా 5GB డేటా.. టీచర్లకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. హీరో బాలకృష్ణకు తప్పిన ప్రమాదం.. నేటి టాప్ టెన్ న్యూస్

దేశ వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు:


దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగిగాయి. ఢిల్లీలో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్-సీసీ, ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్షక దళం కవాతు అందరినీ ఆకట్టుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేసీఆర్‌.. పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మారక స్థూపం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అమర జవానులకు ఘన నివాళులు అర్పించారు.

ప్రభుత్వంపై గవర్నర్ ఫైర్:


తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు..కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తానంటూ వాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ ఆమె పిలుపునిచ్చారు.

మళీ మేదీదే అధికారం:


లోక్ సభకు ఇప్పటికప్పడు ఎలక్షన్స్ జరిగితే మళ్లీ ఎన్డీఏ కూటమే అధికారం దక్కించుకుంటుందని.. మోదీ మరో సారి ప్రధాని పదవిని చేపడతారని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తెలిపింది. కేంద్రంలోని కూటమిపై 67 శాతం మంతి సంత‌ృప్తిగా ఉన్నరని వెల్లడించింది. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రతో ప్రయోజనం అంతంతే అని తెలిపింది. ప్రధాని మోదీపై ఆదారణ ఏ మాత్రం తగ్గలేదని సర్వే వెల్లడించింది. ఆయన పనితీరుపై మొత్తం 72 శాతం సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వే తేల్చింది.

బాలకృష్ణకు తప్పిన ప్రమాదం:


వీరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం హిందూపూర్ లో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బాలయ్య తన ప్రచార వాహనంపై నుంచి పడిపోయారు. కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వాహనం కదలడంతో వెనక్కి పడిపోయారు బాలకృష్ణ.. దీంతో కాసేపు ఏం జరుగుతుందో తెలీక అయోమయానికి గురయ్యారు అభిమానులు. అయితే.. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఫ్రీగా 5జీబీ డేటా: రిపబ్లిక్ డే ఆఫర్


ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్రీగా 2GB, 5GB డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. 199కి పైగా ధర కలిగిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికి 2 జీబీ డేటా, రూ.299 కన్నా ఎక్కువ ధర కలిగిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా 5జీబీ డేటా అందించనున్నట్లు తెలిపింది. అయితే.. Vi యాప్ నుంచి రీఛార్జ్ చేసుకున్న వారికే ఈ ఫ్రీ డేటా లభిస్తుంది.

టీచర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్


బదిలీల విషయంలో ఉపాధ్యాయ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 317 జీవో ప్రకారం కొత్త జిల్లాలకు అనుగుణంగా టీచర్లను కేటాయించారు. ఆ సందర్భంలో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. తమను ఒకే చోటుకు బదిలీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2వేల మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఖాళీలు, 317 జీవోకు అనుగుణంగా ఉన్న 615 మంది ఉపాధ్యాయ దంపతులను బదిలీ చేయాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. ప్రస్తుతం సూర్యాపేట మినహా 12 జిల్లాల్లోని 427 మందిని బదిలీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జాబితా సిద్ధం చేసి డీఈవోలకు పంపించింది.

ఫిబ్రవరి 5న బీఆర్ఎస్ నాందేడ్ సభ


మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ బహిరంగ సభకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, షకీల్‌ అమీర్‌, జీవన్‌ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌తో తదితరులు నాందేడ్‌కు వెళ్లి అక్కడి ఎస్పీ కృష్ణకోప్తేను కలిశారు. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేశారు. సభకు కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లను కల్పించాలని కోరారు.

కేసీఆర్ కు సోయి లేదు


రిపబ్లిక్‌ డే వేడుకలపై హైకోర్టు ఆదేశిస్తే తప్ప ప్రభుత్వానికి సోయి రాలేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శిచారు. గవర్నర్‌తో వ్యక్తిగత విబేధాలున్నా ప్రభుత్వం రాజ్యాంగపరమైన బాధ్యత నిర్వర్తించాలన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.

రేపటి నుంచి 4 రోజులు బ్యాంకులకు సెలవులు


మీకు బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే.. ఈ రోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపటి నుంచి వరుసగా 4 రోజుల పాటు సెలవులు రానున్నాయి. రేపు, ఎల్లుండి నాలుగో శనివారం, ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవులు. ఇంకా సోమ, మంగళ వారాల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు వెళ్తుండడంతో సెలవు ఉంటుంది.

టీఎస్-సెట్ పరీక్ష తేదీలు విడుదల:


తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) పరీక్షా తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ ఖరారు చేసింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లెక్చరర్లుగా పనిచేసేందుకు అర్హత కల్పించే ఈ పరీక్షను 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 13,14,15వ తేదీల్లో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పింది. టీఎస్ సెట్ కు అప్లై చేసుకున్న వారందరికీ త్వరలోనే ఎగ్జామ్ సెంటర్లు కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here