తెలంగాణ పోలీస్ బాస్ ఆయనేనా?
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎవరన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. సీనియారిటీ ప్రకారం అంజనీకుమార్, సీవీ ఆనంద్ పేర్లు ఈ రేసులో ఉన్నాయి.. ఇద్దరిలో ఎవరివైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపనున్నారు..? ఫుల్ స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక ఆదేశాలు..
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్ లకు జారీ చేసిన నోటీసుల నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. వారికి సీఆర్పీసీ 41ఏ కింద నోటిసులు ఇచ్చి విచారించడానికి అనుమతి ఇచ్చింది. అయితే.. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ లో సైన్స్ సిటీ
హైదరాబాద్ నగరంలో 25 ఎకరాల్లో స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నగరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వ ఆర్థి సాయంతో అమలవుతున్న పథకాలను ఆయన సమీక్షించారు.
కాంగ్రెస్ లో మళ్లీ భగ్గుమన్న విభేదాలు:
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడు చేసేది 100 శాతం తప్పని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నాలుగు నెలలుగా పార్టీ సమావేశాలు లేవని మండిపడ్డారు. జూమ్ మీటింగ్ లతో ప్రయోజనం లేదన్నారు. పార్టీ లీడర్లు ఇతర పార్టీలకు మారుతుంటే ఏం చేస్తున్నారని.. కనీసం వారితో మాట్లాడి ఆపే ప్రయత్నం ఎందుకు చేయటం లేదని అన్నారు. సీఎల్పీ, పీసీసీ రెండూ ఫెయిలయ్యాయని ఆయన అన్నారు.
పోలీసుల కనుసన్నల్లోనే అర్వింద్ అంటిపై దాడి: బండి
పోలీసుల కనుసన్నల్లోనే ఎంపి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ వారు దాడి చేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. శనివారం ధర్మపురి అర్వింది ఇంటికి వెళ్లి ఆయనను బండి సంజయ్ పరామర్శించారు.
కాంగ్రెస్ నుంచి మర్రి బహిష్కరణ
బీజేపీలో చేరుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌పై సంచలన కామెంట్లు చేశారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందంటూ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయనను ఆరేండ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.
ఇంజనీరింగ్ విద్యార్థులకు 30 గ్రేస్ మార్కులు
ఇంజనీరింగ్ లో ఆర్18 (2018) బ్యాచ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులను 30కి పెంచుతూ జేఎన్టీయూ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ లో సైన్స్ సిటీ
హైదరాబాద్ నగరంలో 25 ఎకరాల్లో స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నగరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వ ఆర్థి సాయంతో అమలవుతున్న పథకాలను ఆయన సమీక్షించారు.తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం దాదాపు 60 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
అట్టహాసంగా ఇండియన్ రేసింగ్ లీగ్
ప్రతీష్టాత్మకం ఇండియన్ రేసింగ్ లీగ్ నెక్లెస్ రోడ్ లోని స్ట్రీట్ సర్క్యూట్ లో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ ఈ పోటీలను లాంఛనంగా ప్రాంరభించారు. ఫిబ్రవరి 11 జరగనున్న ఫార్ములా-ఈ పోటీలకు ట్రయల్ రన్ గా భావిస్తున్న ఈ లీగ్ లో 2.3 కి.మీ ట్రాక్ పై కార్లు పరుగులు పెట్టాయి.
నేటి నుంచి ఫుట్‌బాల్ వరల్డ్ కప్
నేటి నుంచే ఫుట్‌బాల్ వరల్డ్ కప్ సంగ్రామం మొదలవుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ పోటీలు ఈసారి ఖతార్‌లో జరుగుతున్నాయి. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ టోర్నీలో ఈసారి 32 జట్లు పోటీ పడుతున్నాయి. మొత్తం 64 మ్యాచ్ లు జరుగనున్నాయి. మొత్తం 29 రోజులు జరిగే ఈ వరల్డ్ కప్ ఫుట్‌బాల్ అభిమానులను అలరించనుంది.