సినిమా ఇండస్ట్రీలో కొన్ని హిట్స్ కాంబినేషన్ ఉంటాయి. అవి హీరో, హీరోయిన్ కావచ్చు హీరో, డైరెక్టర్ కావచ్చు. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. మేకర్స్ కూడా వీరి కాంబినేషన్ ను ఎక్కువగా రిపీట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.
ఇక అందులో చిరంజీవి, విజయశాంతి లది సూపర్ హిట్స్ కాంబినేషన్. మొత్తం వీరిద్దరికీ కాంబినేషన్లో ఇప్పటివరకు 19 సినిమాలు వచ్చాయి. మొదటగా వీరిద్దరూ సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సంఘర్షణ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక దేవంతకుడు, మహానగరంలో మాయగాడు, ఛాలెంజ్, చిరంజీవి, కొండవీటి రాజా, చాణక్య శపథం, పసివాడి ప్రాణం, దైర్యవంతుడు, కొండవీటి రాజా, స్వయంకృషి, మంచిదొంగ, యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్ర నేత్రం, కొండవీటి దొంగ,గ్యాంగ్ లీడర్ చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించారు.
మెకానిక్ అల్లుడు వీరిద్దరూ చివరిసారిగా కలిసి నటించారు. అయితే గ్యాంగ్ లీడర్ మూవీ సమయంలో వీరిద్దరికీ మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. సినిమా క్రెడిట్ విషయంలో నాదంటే నాదే అని ప్రమోషన్స్ చేసుకున్నారని, ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.