మెగాస్టార్ చిరంజీవి సరసన చాన్స్ వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది చెప్పండి..కానీ నదియాకు మాత్రం ఆ చాన్స్ వస్తే వదులుకుంది. కారణం పెళ్లి అవడమే. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. కౌబాయ్ సినిమాలంటే అప్పట్లో హీరో కృష్ణ పెట్టింది పేరు. అలాంటి టైమ్ లో హీరో చిరంజీవితో కౌబాయ్ సినిమా చేయాలని భావించారు నిర్మాత కైకాల నాగేశ్వరరావు. చిరంజీవికి ఈ విషయం చెబితే ఆయన కూడా చేయడానికి ఒప్పుకున్నారు. బడ్జెట్ ఎక్కువవుతుందని చిరంజీవి చెప్పినా నాగేశ్వరరావు వెనకాడలేదు.
దర్శకుడి కోసం వెతకగా తన క్లాస్ మేట్ అయిన మురళీమోహనరావుకు ఈ పని అప్పగించాడు మురళీ మోహనరావు. అంతకుమునుపు ఆయన చిరంజీవితో కలిసి సంఘర్షణ సినిమా కోసం పనిచేశాడు. ఈ చిత్ర కథ కోసం పలు హాలీవుడ్ సినిమాలు చూశారు. నాగేశ్వరరావు, విజయేంద్ర ప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ కలిసి కథను తయారు చేశారు. కౌబాయ్ చిత్రమైనా దేశీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కథను మలుచుకున్నారు. ఈ సినిమాకు కొదమసింహం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్ లను తీసుకున్నారు. రాధ, వాణీ విశ్వనాధ్, నదియా.. ఇందులో వాణీ విశ్వనాధ్ గెస్ట్ రోల్ చేసింది. అయితే మెయిన్ హీరోయిన్‌గా నదియానే అనుకున్నారు కానీ ఆమెకి అప్పటికే పెళ్లి అయింది. అయినప్పటికీ నిర్మాత నాగేశ్వరరావు ఆమెను ఈ సినిమా చేయమని ఒప్పించారు.
కానీ చిరంజీవి డేట్లకి ఆమె డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారు.. ఆమె స్థానంలో హిందీ నటి సోనంను తీసుకున్నారు. రాధను మెయిన్ హీరోయిన్ ను చేశారు. ఈ చిత్రం ఆగస్టు 9, 1990 లో విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. 20 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.