2005లో బన్ని మూవీ తరువాత స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ వివి వినాయక్ కు చాలా ఆఫర్లు వచ్చాయి. నాగార్జున, ప్రభాస్ లాంటి హీరోలు సినిమా చేస్తామని చెప్పారు. ప్రభాస్ డేట్స్ లేట్ అవుతున్నాయి. నాగార్జున మరో 3 నెలల తరువాత సినిమా చేద్దామన్నారు. దీంతో వినాయక్ ఖాళీగా ఉన్నారు. వినాయక్ ఫ్రెండ్ నల్లమలపు శ్రీనివాస్ దగ్గర వెంకటేష్ డేట్స్ ఉన్నాయి. దీంతో వెంకటేష్, వివి వినాయక్ కాంబో సెట్అయింది. అదే లక్ష్మి.
2006 లో విడుదలైన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన చార్మి, నయనతార హీరోయిన్లుగా నటించారు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అర్తి అగర్వాల్ ను అనుకున్నారు, కానీ ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా చేయనంది. ఆ తరువాత జ్యోతికను సంప్రదించారు. అయితే సూర్యతో పెళ్లి కారణంగా ఈ సినిమా ఆఫర్ ను తిరస్కరించింది జ్యోతిక. దీంతో ఆమె ప్లేస్ లో నయనతారను తీసుకున్నారు. నయనతారకు ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను అనుకుంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు. దీంతో రమణ గోగులను తీసుకున్నారు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయిన చేయాలని మణిశర్మ దగ్గర మాట తీసుకున్నారు వినాయక్ . దీంతో మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ చేశారు. వరల్డ్ వైడ్ గా 316 స్క్రీన్లలో విడుదలైన లక్ష్మి చిత్రం మొదటి వారంలో రూ.8 కోట్లు వసూలు చేసింది. మొత్తం రూ.22 కోట్లు వసూలు చేసింది . 215 కేంద్రాలలో 50-రోజులు, 94 కేంద్రాలలో 100 రోజుల ఆడింది ఈ చిత్రం, ఈ చిత్రాన్ని అదే పేరుతో తమిళంలోకి డబ్ చేశారు.