ఆలేరు నియోజకవర్గం:
యాదాద్రి జిల్లా
మండలాలు; ఆలేరు, గుండాల, ఆత్మకూర్ ఎం, మోటకొండూరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మల రామారం
Alair Election Results 2018
2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
GONGIDI SUNEETHA | Telangana Rashtra Samithi | 94870 |
BUDIDA BIKSHAMAIAH | Indian National Congress | 61784 |
KALLURI RAMCHANDRA REDDY | Bahujan Samaj Party | 11923 |
MOTHKUPALLY NARSIMHULU | Bahujana Left Party | 10473 |
DONTHIRI SRIDHAR REDDY | Bharatiya Janata Party | 4967 |
KANDADI MANIPAL REDDY | Telugu Congress Party | 1230 |
SARITHA JANNE | Samajwadi Party | 1200 |
DHEERAVATH GOPI NAYAK | Independent | 1112 |
VYLA SRINIVAS REDDY | Independent | 913 |
BOLLARAM RAMESH | Independent | 380 |
MORIGADI KRISHNA | Independent | 358 |
KOTHA KISTAIAH | Ambedkar National Congress | 315 |
GUJJULA RAMCHANDRA REDDY | Independent | 260 |
REGU ANAND | Bahujana Rashtra Samithi | 231 |
None of the Above | None of the Above | 1465 |
SITTING AND PREVIOUS MLAS
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | GONGIDI SUNEETHA | TRS | 94870 | BUDIDA BIKSHAMAIAH | INC | 61784 |
2014 | Gongidi Sunitha | TRS | 91737 | Budida Bikshamaiah | INC | 60260 |
2009 | Budida Bikshmaiah | INC | 66905 | Kallem Yadagiri Reddy | TRS | 54003 |
2008 | Dr.Kududula Nagesh | TRS | 45867 | Mothuku Pally Narsimhulu | TDP | 41943 |
2004 | Dr. Kududula Nagesh | TRS | 66010 | Mothukupally Narsimhulu | TDP | 41185 |
గొంగిడి సునీత (టీఆర్ఎస్ ఎమ్మెల్యే)వరుసగా 2014, 2018లో గొంగిడి సునీత కాంగ్రెస్ ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పై పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు భిక్షమయ్య కూడా టీఆర్ఎస్లో ఉన్నారు.
నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ్స్, కురుమ కులాల జనాభా ఎక్కువ. ఆ తర్వాత స్థానం ఎస్సీలది.
ఆలేరు నియోజకవర్గంలో ప్రస్తుతం టీఆర్ఎస్ బలంగా ఉంది. అభ్యర్థిగా చూస్తే వరుసగా రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గొంగిడి సునీతపై వ్యతిరేకత పెరిగింది. 2018 ఎన్నికల్లో కూడా సునీతపై వ్యతిరేకత కన్పించినా.. సీఎం కేసీఆర్ ప్రచారం చేసి.. సునీత నా బిడ్డతో సమానం. ఆమెకు మంచి స్థానం కల్పించడంతో పాటు నియోజకవర్గంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్‌గా మారుస్తానని ప్రకటించడంతో పాటు పూర్తిగా డెవలప్ చేస్తానని ప్రకటించారు. సీఎం హామీలతో పాటు కాంగ్రెస్ లోని కుమ్ములాటల కారణంగా సునీత గెలిచారు.
కాంగ్రెస్, బీజేపీలో సరైన అభ్యర్థులు లేరు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో భిక్షమయ్యకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆలేరు నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. బీసీ ల్లో బలమైన లీడర్.
బీసీ లీడర్లలో మంచి పేరున్న ఆలేరు మాజీ మార్కెట్ చైర్మన్ పడాల శ్రీనివాస్ ను మండల పార్టీ మీటింగ్ గొడవల కారణంగా ఈ మధ్యనే ఎమ్మెల్యే సునీత టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్, బీర్ల అయిలయ్య, కల్లూరి రాంచంద్రారెడ్డితో పాటు బోరెడ్డి అయోధ్యరెడ్డి ఆసక్తి చూపుతున్నారు. వీరిలో కుడుదుల నగేశ్ నియోజకవర్గంలో అందరికీ పరిచయస్తుడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి ఆరోపణలు లేవు. బీర్ల అయిలయ్య ఈ మధ్యనే నియోజకవర్గంలో పర్యటిస్తూ తనకంటూ ఇమేజ్ పెంచుకుంటున్నారు. కల్లూరి రాంచంద్రారెడ్డి తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు మండలాల్లో ఈ మధ్య పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అయోధ్యరెడ్డి ఇప్పటి వరకు తుర్కపల్లి మండలానికే పరిమితంగా ఉన్నారు.
బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు బండ్రు శోభారాణి ఆలేరు నియోజకవర్గంలో కొంత పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శోభారాణి కేండిడేట్ అన్న ప్రచారం జరుగుతోంది.
లెఫ్ట్ పార్టీల ప్రభావం లేదు. గత ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ పార్టీ నుంచి పోటీ చేసిన మోత్కుపల్లి నర్సింలు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్కు మద్దతుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో ఈయన ప్రభావం.. ఓటు బ్యాంకు ఏమీ లేదు.
నియోజకవర్గంలో సమస్యలు
@ ఇది పూర్తిగా మెట్ట ప్రాంతం. సాగునీటి వనరులు లేవు. బోరు బావులే దిక్కు. గత ఎన్నికల్లో సీఎం హామీ ఇచ్చిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం ఇప్పటికీ చేపట్ట లేదు.
@ కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ ఫామ్ హౌజ్ దగ్గరి కొండపోచమ్మ సాగర్‌కు తెచ్చినప్పటికీ బస్వాపురం వరకు లింక్ చేసి.. ఈ ప్రాంతంలోని చెర్వులు, కుంటలు నింపే పనులను పట్టించుకోవటం లేదు.
@ మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ ఇస్తామని చెప్పినప్పటికీ.. ఈ నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది.