నల్గొండ నియోజకవర్గం NALGONDA

నల్గొండ నియోజకవర్గం:
మండలాలు; నల్గొండ మండలం, తిప్పర్తి, కనగల్

ఎమ్మెల్యే  కంచర్ల భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)

Nalgonda Election Results 2018

2018 Assembly Elections

Candidate NamePartyVotes
KANCHARLA BHUPAL REDDYTelangana Rashtra Samithi98792
KOMATI REDDY VENKAT REDDYIndian National Congress75094
POLISHETTY VENKATESHWARLUIndependent2932
SRIRAMOJU SHANMUKHA CHARYBharatiya Janata Party1916
MOHAMMAD MAJEEDIndependent1686
AKKENEPALLY MEENAIAHBahujana Left Party1146
RUPANI SAIDULUIndependent856
SHASHIDHAR REDDY GANTLAIndependent559
BOLLA VENKATA MUDIRAJ (BVM)Independent345
KODIMALA SHIVAKUMARPyramid Party of India204
S.K.EBRAHIMIndependent177
CHOLLETI PRABHAKARIndependent171
PARVEENIndependent145
KATTELA SHIVAKUMARTelangana Prajala Party114
KADIUM KRUPAKARIndependent87
GULAM SUBHANIIndependent61
KONDA GANESHIndependent57
None of the AboveNone of the Above1276

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018KANCHARLA BHUPAL REDDYTRS98792KOMATIREDDY VENKAT REDDYINC75094
2014Komatireddy Venkat ReddyINC60774Kancharla Bhupal ReddyIND50227
2009Komatireddy Venkat ReddyINC60665Nandyala Narsimha ReddyCPM52288
2004Komatireddy Venkat ReddyINC69818Gutha Sukender ReddyTDP47080

గతంలో కాంగ్రెస్ కోటగా ఉన్న సాగర్ లో తొలిసారిగా టీఆర్ఎస్ గెలిచింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2018 ఎన్నికల్లో ఫస్ట్ టైం కంచర్ల భూపాల్​రెడ్డిపై ఓడిపోయారు. తర్వాత వచ్చిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయాక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.

నియోజకవర్గంలో టీఆర్​ఎస్, కాంగ్రెస్​ పోటాపోటీ బలాలతో ఉన్నాయి. ఎమ్మెల్యేగా భూపాల్​రెడ్డి  టీఆర్​ఎస్ నుంచి​ గెలిచినప్పటికీ.. తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్​ గట్టి పోటీ ఇచ్చింది. ఎంపీ ఎన్నిక ల్లోనూ కాంగ్రెస్ పుంజుకుంది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది.  

ఈ నియోజకవర్గంలో  ఎస్సీలు 36 వేల మంది, ముస్లింలు 25 వేలు, రెడ్లు 28 వేలు, యాదవులు 20 వేలు, గౌడ్స్ 17 వేల వరకు ఉంటారు. మున్నూరు కాపులు 8 వేల వరకు ఉంటారు. పద్మశా లీలు ఐదు నుంచి ఆరు వేల మంది ఉంటారు. 

కాంగ్రెస్​లో కోమటిరెడ్డి వర్గానికి దుబ్బాక నర్సింహరెడ్డి వర్గానికి  మద్య విభేదాలున్నాయి. నర్సింహరెడ్డి అసలు నల్గొండలో అడుగుపెట్టవద్దని  కోమటిరెడ్డి వర్గీ యులు కాంగ్రెస్ పార్టీ స్టేట్ నాయకత్వానికి కంప్లైట్ చేశారు. కానీ దుబ్బాక వర్గానికే జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. దీంతో విభేదాలు మరింత పెరిగిపోయాయి. ఇటీవల కోమటిరెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం స్టార్ట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పార్టీ కేడర్​ కు  భరోసా ఇస్తున్నారు.

బీజేపీ మూడో ప్లేస్ లో ఉంది. నల్గొండ టౌన్ లో పార్టీకి బలం పెరిగింది. తర్వాత తిప్పర్తి, కనగల్ మండలాల్లో ప్రభావం ఉంది.  ఎంపీ ఎన్నికల్లో నల్గొండ సెగ్మెంట్ లొనే  బీజేపీకి 20 వేల ఓట్లు వచ్చాయి.. పార్టీ స్టేట్ కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

నియోజకవర్గంలో సమస్యలు:

@ నల్గొండ దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ 2018 ఎన్నికల్లో  ప్రకటించారు. పట్టణాన్ని బంగారు తునపు ముక్క చేస్తానని ప్రకటించారు.  కానీ ఎన్నికల్లో గెలిచాక నల్గొండ మొఖం కూడా చూడలేదు.

@ నల్గొండ పట్టణం లో పెండింగ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచిపోయింది. నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పారు.

@మెడికల్ కాలేజీ ఇచ్చారు. తప్పా సరియైన సదుపాయాలు కల్పించలేదు.

@ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పెండింగ్లో నే ఉన్నాయి. నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి రెండు రోజులు ఇక్కడే మకాం పెట్టి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తానని సీఎం చెప్పారు. ఇవేవీ జరగలేదు.

@ తిప్పర్తి మండలంలో కోటప్పమత్తిడి వాగు పనులు పూర్తిచేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కానీ చే యలేదు. 2008లో వేసిన రోడ్లు, డ్రైనేజీలు తప్పా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్క కొత్త రో డ్డు కూడా వేయలేదు.

@కనగల్, నల్గొండ రూరల్ మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు ఏర్పాటు చే స్తానని చెప్పారు. కానీ అది పెండింగ్లోనే ఉంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here