ఆలంపూర్ ALAMPUR

అలంపూర్​ నియోజకవర్గం

మండలాలు: 1) అలంపూర్​ 2) మానవపాడు, 3) ఇటిక్యాల 4) వడ్డెపల్లి 5) రాజోళీ 6) అయిజ 7) ఉండవెల్లి

ఎస్సీ రిజర్వ్​ నియెజకవర్గం.

ఎమ్మెల్యే అబ్రహం (టీఆర్​ఎస్​)

కాంగ్రెస్​కు మంచి పట్టుఉన్న నియోజకవర్గంలో 2018లో టీఆర్​ఎస్​ తొలిసారిగా గెలిచింది. అలంపూర్​ నియెజకవర్గం నుంచి పోటి చేసిన అబ్రహం కాంగ్రెస్​ అభ్యర్థి సంపత్​కుమార్​పై 36వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈకానిస్టెన్సీ ఆంధ్రప్రదేశ్​కు సరిహద్దు. తుంగభద్ర నది ప్రవహించే చోటు, కృష్ణానదితో సంగమిస్తుంది ఈనియోజకవర్గంలోనే. ఐదవ శక్తీ పీఠం జోగులాంబ అమ్మవారు కొలువు తీరింది ఇక్కడే. 2009లో కాంగ్రెస్​ తరఫున, అప్పటి మాజీ ఎమ్మెల్యే చల్లవెంకట్రామరెడ్డి ఆశీస్సులతో అబ్రహం ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ అవిర్బావం తర్వత ఆయనకు కాంగ్రెస్​ టికెట్​ నిరాకరించడంతో టీడీపీలో చేరి టికెట్​ తెచ్చుకుని పోటిచేశారు. 2014లో కాంగ్రెస్​ తరఫున పోటిచేసిన సంపత్​ అబ్రహంపై గెలుపొందారు. 2018 ఎన్నికల ముందు టీఆర్​ఎస్​లో చేరిన అబ్రహం ఆపార్టీ టికెట్​పై పోటి చేసి విజయం సాధించారు. టీఆర్​ఎస్​ తరఫున మంద శ్రీనాథ్​, అయిజ మాజీ ఎంపీపీ సుందర్​రాజు, మాజీ జడ్పీ చైర్మన్​ బండారి భాస్కర్​ కూడ టికెట్​ రేసులో ఉన్నారు. కాంగ్రెస్​ తరఫున సంపత్​కుమార్​ వచ్చె ఎన్నికల్లో పోటి చేయవచ్చు.

ఈకానిస్టెన్సీలో ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. తర్వత బీసీలదే ఆధీపత్యం..ఎస్సీకి ఇది రిజర్వ్​ అయింది.

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు:

ఆర్డీఎస్​ ప్రధాన సమస్య.. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇప్పటికి వస్తలేవు. తుంగభద్ర నదిపై నిర్మించిన ఆర్డీఎస్​ ద్వార అలంపూర్​ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఈపథకం కింద సాగునీళ్లు రాకుండా రాయలసీమ నేతలు అడ్డుపడ్తున్నారు. వైఎస్​ హయంలో ఆర్డీఎస్​ తూములను మూయించినా..రాయలసీమ నేతలు వాటిని బాంబులతో పగులగొట్టడం తీవ్ర సంచలనం కలిగింది. కేసీఆర్​ ఈప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వార 80 వేల ఎకరాలకు నీరందించవచ్చని భావించి 2018లో కేసీఆర్​ దీనికి శంఖుస్థాపన చేశారు. కాని పనులు ప్రారంభం కాలేదు.

ఐదవ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారి దేవాలయ సముదాయానికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. 2014లో కృష్ణ పుష్కరాలకు వచ్చిన సీఎం కేసీఆర్​ వంద కోట్లు కేటాయిస్తానని చెప్పి ఇప్పటి వరకు కేటాయించలేదు. వసతి, రహదారులు లేక​ ప్రసిద్ద ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

Alampur Constituency Election Result 2018

Candidate NamePartyVotes
ABRAHAM V.M.Telangana Rashtra Samithi102105
S.A.SAMPATH KUMARIndian National Congress57426
HARIJANA ABRAHAMSamajwadi Forward Bloc8803
B.RAJINIBharatiya Janata Party1965
B.HUSSAINBahujan Samaj Party1066
T.SURESH MAHARAJIndependent983
N.SOMESHWARIIndependent896
PRASANGIPyramid Party of India711
K. JAYAPALIndependent517
K.VARAPRASAD RAOBahujana Left Party514
A.RAGHUVARDHANIndependent364
D.LAXMANNAIndependent354
M. MADDLLETIIndependent250
H.PARUSHA RAMUDUShiv Sena237
None of the AboveNone of the Above3492

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018ABRAHAM V.M.TRS102105S.A.SAMPATH KUMARINC57426
2014S.A.Sampath KumarINC57419V.M.AbrahamTDP50689
2009Abraham.V.M.INC49722Prasanna Kumar. RTDP48539
2004Challa Venkatrami ReddyIND37499Vavilala SuneethaTDP33252

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here