ఇబ్రహీంపట్నం IBRAHIMPATNAM

ఇబ్రహింపట్నం నియోజకవర్గం

డివిజన్లు : అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలు,

మున్సిపాలిటీలు; ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, తుర్కయాంజాల్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలు

రూరల్​ ఓటర్లతో పాటు సిటీ ఓటర్లున్న సెగ్మెంట్​. ఎస్సీలు, ఎస్టీల ఓటు బ్యాంకు కూడా కీలకం.

ఎమ్మెల్యే : మంచిరెడ్డి కిషన్​రెడ్డి (టీఆర్‌ఎస్‌)


Ibrahimpatnam Election Results 2018

2018 Assembly Elections

Candidate NamePartyVotes
MANCHIREDDY KISHAN REDDYTelangana Rashtra Samithi72581
MALREDDY RANGA REDDYBahujan Samaj Party72205
SAMA RANGA REDDYTelugu Desam18053
ASHOK KOTHABharatiya Janata Party17129
PAGADALA YADAIAHCommunist Party of India (Marxist)9106
BATANI KISTAIAHIndependent1220
T. RAJESHWARIJatiya Mahila Party1123
SAPAVAT DEVARAM NAYAKIndependent559
TIRUMAL REDDY. SIndependent470
SAMREDDY SHIV KESH REDDYShiv Sena467
SURAKANTI VIMALA REDDYIndependent396
K. RAVINDER REDDYIndependent356
BP GANESH MUDIRAJSamajwadi Party334
None of the AboveNone of the Above1151

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018MANCHIREDDY KISHAN REDDYTRS72581MALREDDY RANGA REDDYBSP72205
2014Manchireddy Kishan ReddyTDP48397Malreddy RamreddyIND37341
2009Manchireddy Kishan ReddyTDP56508Malreddy Ranga ReddyINC47292
2004Masku NarsimhaCPM67288Narra Ravi KumarTDP54481

వరుసగా మంచిరెడ్డి ఇక్కడ మూడోసారి గెలిచారు. కాంగ్రెస్ మద్దతులో బీఎస్పీ గుర్తుపై పోటీ చేసిన మల్​రెడ్డి రంగారెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. కేవలం 300 ఓట్లతో ఓడిపోయాడు.  మంచిరెడ్డిపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా ఎదిగిన లీడర్లు లేకపోవటం మంచిరెడ్డికి కలిసి వస్తోంది.

కాంగ్రెస్​ కు గట్టి పట్టుంది. బలమైన కేడర్​ కూడా ఉంది. మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్​ గెలుచుకుంది. ఒకటి మాత్రమే టీఆర్​ఎస్​ గెలిచింది. రంగారెడ్డి మినహా చెప్పుకోదగ్గ లీడర్లు ఎవరూ లేరు. మల్​రెడ్డి రంగారెడ్డి తమ్ముడు రాంరెడ్డి  భార్య అనురాధారెడ్డి తుర్క యంజాల్​ మున్సిపల్​ ఛైర్మన్​గా ఉన్నారు.  కొత్త ఆర్తిక ఆదిభట్ల మున్సిపల్​ ఛైర్మన్​గా ఉన్నారు.  కాంగ్రెస్​ నుంచి టీఆర్​ఎస్​ లో చేరి పదవి చేపట్టిన ఆర్తిక కౌన్సిలర్లతో విభేదాలతో మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.  ఎంపీ కోమటిరెడ్డి ప్రభావం కూడా ఈ నియోజకవర్గంపై ఎక్కువగా ఉంది.

గతంలో పోలిస్తే బీజేపీ పుంజుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కొత్త అశోక్​గౌడ్​ ఈ నియోజకవర్గానికి పార్టీ ఇన్​ఛార్జీగా ఉన్నారు.  ఎస్సీ సెల్​ స్టేట్​ ప్రెసిడెంట్​ కొప్పు బాషా (యాచారం ఎంపీపీ భర్త) యాక్టివ్​గా ఉన్నారు. 

వైసీపీ నుంచి  ఎన్​.జంగయ్య గౌడ్​ స్టేట్​ కమిటీ మెంబర్​గా ఉన్నారు. ఆయనే యాక్టివ్​గా ఉన్నారు. ఈయనది మంచాల మండలం. తుర్క యంజాల్​ కు చెందిన  అమృత సాగర్​ కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటున్నారు.

నియోజకవర్గంలో సమస్యలు

@ అబ్దుల్లాపూర్​పేట్​ మండలం బండరావిరాల, చిన్న రావిరాల గ్రామాలను మైనింగ్​ జోన్​ పరిధిలోకి తీసుకున్నారు. దాదాపు 600  ఎకరాల్లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయలేదు.

@ యాచారం, కందుకూర్​, కడ్తాల్​ మండలాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటికే దాదాపు 9 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మరో 10 వేల ఎకరాలు సేకరించే పనిలో ఉంది. దీనిపై స్థానికంగా అన్ని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here