దేవరకొండ నియోజకవర్గం:
ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్
మండలాలు: దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి, పీఏపల్లి, డిండి, చందంపేట, నేరెడుగొమ్ము
ఎమ్మెల్యే : రమావత్ రవీంద్ర కుమార్ (టీఆర్‌ఎస్ )
Devarakonda Election Results 2018
2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
RAMAVATH RAVINDRA KUMAR | Telangana Rashtra Samithi | 96454 |
BALU NAIK NENAVATH | Indian National Congress | 57606 |
BHEELYA NAIK KETHAVATH | Bahujan Samaj Party | 19350 |
BHOJYA NAIK RAMAVATH | Prajaa Swaraaj Party | 3247 |
GOPI @ KALYAN NAIK | Bharatiya Janata Party | 3152 |
SREENU VADTHYA | Independent | 1190 |
LAXMAN NAYAK RAMAVATH | Communist Party of India (Marxist) | 1084 |
KONREDDY POCHAIAH | Independent | 798 |
KATRAVATH VENKATESH | Bahujan Mukti Party | 542 |
PANDU RAMAVATH | Independent | 466 |
None of the Above | None of the Above | 1695 |
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | RAMAVATH RAVINDRA KUMAR | TRS | 96454 | BALU NAIK NENAVATH | INC | 57606 |
2014 | Ravindra Kumar Ramavath | CPI | 57717 | Bheelya Naik Kethavath | TDP | 53501 |
2009 | Balu Naik Nenavath | INC | 64887 | Ravindra Kumar Ramavath | CPI | 57419 |
2004 | Ravindra Kumar Ramavath | CPI | 61748 | Vadthya Shakru Naik | TDP | 44561 |
గత ఎన్నికల్లో రమావత్ రవీంద్ర కుమార్ కాంగ్రెస్ అభ్యర్థి నేనావత్ బాలునాయక్‌పై 38,887 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. బీజేపీ నుంచి కల్యాణ్‌నాయక్, బీఎస్పీ నుంచి కేతావత్ బీల్యానాయక్ పోటీ చేశారు.
ప్రస్తుతం రవీంద్రకుమార్ బలంగా ఉన్నారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారు. బాలునాయక్ కూడా బలం పుంజుకుంటున్నారు. మళ్లీ వీరిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది.
రిజర్వుడు నియోజకవర్గం. అన్ని మండలాల్లో గిరిజనులే ఎక్కువ. టిఆర్‌ఎస్ బలంగా ఉంది. కాంగ్రెస్, సీపీఐ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ యాక్టివిటీ సాగర్ బై ఎలక్షన్ నుంచి మొదలైంది.
నియోజకవర్గంలోని సమస్యలు:
@ దేవరకొండ నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి చేసి సాగు,త్రాగు నీరందిస్తామన్న ఎన్నికల హామి నెరవేరలేదు.
@ డిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాలకు సాగు నీరు అందించాలని ప్రజల డిమాండ్.
@ గుట్టలపై ఉన్న గ్రామాలకు లిఫ్టు స్కీం ద్వారా సాగు నీరు అందిస్తామని గత ఎన్నికల ప్రచారం స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు చేయలేదు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో శంకుస్థాపన చేశారు. పనులు కేవలం సర్వేకే పరిమితం అయ్యాయి.
@ పోడు భూముల సమస్య పరిష్కరించాల్సి ఉంది.
@ డిండి మండల కేంద్రంలో 900 మంది రైతులు సంబంధించి దాదాపు 460 ఎకరాల ప్రభుత్వ భూమి ఇరిగేషన్ శాఖ పేరు మీదకు మారింది. ఆ భూములు తిరిగి రైతులకు ఇప్పిస్తానని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ హామీనిచ్చారు.