మిర్యాలగూడ నియోజకవర్గం MIRYALAGUDA

మిర్యాలగూడ నియోజకవర్గం :

మండలాలు: అడవి దేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి.

ఎమ్మెల్యే: భాస్కర్ రావు (టీఆర్ఎస్)

Miryalguda Election Results 2018

2018 Assembly Elections.

Candidate NamePartyVotes
NALLAMOTHU BHASKAR RAOTelangana Rashtra Samithi83931
R. KRISHNAIAHIndian National Congress53279
DHEERAVATH SKYLAB NAIKIndependent13961
JULAKANTI RANGA REDDYCommunist Party of India (Marxist)11221
PALLAPU BIKSHPATHI RAOIndependent4758
KARNATI PRABHAKARBharatiya Janata Party2502
JILLA RAVIIndependent1183
CHINTHALA ARAVINDHA REDDYPyramid Party of India849
RAJU JADIBahujan Samaj Party812
KAMPASATI VENKANNAIndependent745
K. SRIDHAR GUPTHAIndependent532
KODAVATH NAGA NAIKIndependent436
DHANAVATH LALU NAIKIndependent380
SYED FAROOQIndependent366
KARANTOTHU MANGTHAIndependent334
NAGENDAR BHOKRAYIndependent289
JANAIAH NANDIPATIIndependent241
KONUGANTTI RAGHAVARANIJai Swaraj Party235
BALAKRISHNA RAOShiv Sena199
NEELAKANTAMBahujan Mukti Party195
SUNKU SRINIVASIndependent189
KODIREKKA ILAYARAJAIndependent186
BOLUSANI KRISHNAIAHIndependent181
GARIKAPATI RADHAKRISHNANavodayam Party165
ADE YADAGIRIIndependent158
MD. FAROOQAam Aadmi Party143
RAJU RAMDENIIndependent126
SARIKONDA RUSHIKESHWAR RAJUIndependent107
M.V.R. REDDYIndependent95
None of the AboveNone of the Above1239

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018NALLAMOTHU BHASKAR RAOTRS83931R. KRISHNAIAHINC53279
2014Bhaskar Rao NallamothuINC62059Alugubelli Amarender ReddyTRS56005
2009Julakanti Ranga ReddyCPM52227Gangadhar TirunagaruINC47864
2004Julakanti Ranga ReddyCPM81014Chandrasekhar Reddy PoreddyTDP49859

ఈ నియోజకవర్గంలో  ప్రస్తుతం 2 లక్షల 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. గిరిజనులు, ఎస్సీలు,  బీసీ, రెడ్లు, వైశ్య ఓటర్లు  ఎక్కువగా ఉన్నారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్  అభ్యర్థిగా బరిలోకి దిగిన భాస్కర్ రావు  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్. కృష్ణ య్య పై 30 వేల ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.

గడిచిన శాసన సభ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీకి మిర్యాలగూడ టౌన్, రూరల్, దామరచర్ల మండల పరిధిలో అత్యధిక ఓట్లు వచ్చాయి.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ నుంచి భాస్కర్ రావు  లేదా అతని కుమారుడు సిద్దార్థ ఎమ్మెల్యే పోటీలో ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.

కాంగ్రెస్ నుంచి  బత్తుల లక్ష్మారెడ్డి, జానా తనయుడు రఘు వీర్ రెడ్డి, డీసీసీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు.  రఘువీర్ రెడ్డి  మిర్యాలగూడకు మకాం మార్చి…  పార్టీ శ్రేణులు,  బంధువుల సలహాలు,  సహకారంతో వచ్చే ఎన్నికలకు  ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

బీజీపే నుంచి సాధినేని శ్రీనివాస రావు

సీపీఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రేసులో ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ వైఎస్ ఆర్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది.  రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి  వైఎస్ ఆర్ టీపీ తరఫున  ఇక్కడ  పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.

నియోజకవర్గంలో సమస్యలు

1. దామరచర్ల పరిధిలో లిఫ్టుల ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు

2. అర్బన్ ఏరియాకు సంబంధించి…560 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం చేశారు. మైనర్  ఇన్ఫ్రాసృక్చర్ పనులు ప్రారంభం కాలేదు.

3. వేములపల్లి మండల పరిధిలో శెట్టిపాలం రోడ్డు అసంపూర్తిగా వదిలేశారు.

4. అన్నపురెడ్డి గూడ నుంచి గోగువారి వరకు రోడ్డు పూర్తి గా ద్వంసం అయింది.

5. బాపూజీ నగర్, ఇతర రోడ్ల వెంట ఉన్న రైస్ మిల్లులు నుంచి..కాలుష్యం సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.

6. కూరగాయల  మార్కెట్ అప్ గ్రేడ్ చేస్తామన్న హామీ నెరవేర్చలేదు

7. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యమవుతోంది

8..అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టలేదు

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here