దేవర్కద్ర నియెజకవర్గం:
మండలాలు: దేవరకద్ర, భూత్పుర్, అడ్డాకుల, ముసాపేట, కొత్తకోట, చిన్నచింతకుంట, మదనపురం
ప్రస్తుత ఎమ్మెల్యే: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్)
టీడీపీ కంచుకోటగా ఉన్న దేవరకద్రలో వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఆలవెంకటేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపవన్కుమార్రెడ్డిపై 36వేల ఓట్ల తేడాతో 2018లో గెలిచారు. ద్వితియ శ్రేణి లీడర్లేవరు ఆపార్టీలో ఎదగలేదు.
కాంగ్రెస్ నుంచి జి. మధుసుధన్‌రెడ్డి,ప్రదీప్‌గౌడ్‌లు యాక్టివ్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈఇద్దరు టికెట్ కోసం పోటి పడ్తున్నారు. ఈఇద్దరిలో ఏవరికి టికెట్ రాకున్నా మరోకరు ఇండిపెండెంట్‌గా పోటికి దిగోచ్చు. దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్‌రెడ్డి కూడ కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతుంది.
బీజేపీ నుంచి పవన్‌కుమార్‌రెడ్డి, యెగ్గని నర్సింహులు రంగంలో ఉన్నారు. పవన్‌కుమార్ డీకే అరుణ వెంట కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఎగ్గని నర్సిములు పార్టీని నమ్ముకుని ఉన్నారు. గత ఎన్నికల్లో పోటి చేసి ఓటమి పాలయ్యారు.
ఈనియోజకవర్గంలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రెండవ స్థానంలో ఎస్సీ ఓటర్లున్నారు. కాని రెడ్డి ఆధిపత్యం కలిగిన కానిస్టెన్సీ..
నియోజకవర్గంలో సమస్యలు
దేవరకద్ర నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వార సాగునీరు అందిస్తామని హమి ఇచ్చి ఏడేళ్లయిన కార్యరూపం దాల్చలేదు. కర్వేన రిజార్వాయర్ బాధితులకు నష్టపరిహరం విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆనకట్ట నిర్మాణం నాసిరకంగా కడుతున్నారని చెప్పిన పట్టించుకోవడం లేదు.
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వార చివరి ఆయకట్టుకు నీరందించడం లేదు. కాల్వల ఆధునికరణ, లైనింగ్ పనులు లేవు. కోయిల్‌సాగర్ కాలువల నిర్మాణం చేపడ్తులేరు.
ఊకచెట్టు వాగు పరివాహక ప్రాంతాల్లో టీఆర్ఎస్ లీడర్లు ఇసుక అక్రమ రవాణ చేస్తున్నారని..దీనివల్ల భూగర్బ జలాలుపడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన పట్టించుకోవడం లేదు.
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | ALLA VENKATESWAR REDDY | TRS | 96130 | PAVAN KUMAR | INC | 60882 |
2014 | Alla Venkateshwar Reddy | TRS | 66354 | Pavan Kumar | INC | 49432 |
2009 | Seetha Dayakar Reddy | TDP | 58576 | S.Swarna Sudhakar | INC | 39540 |