పటాన్చెరు నియోజకవర్గం :
మండలాలు; పటాన్ చెరు, అమీన్ పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల
ఎమ్మెల్యే: గూడెం మహిపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ నుండి కాట శ్రీనివాస్ గౌడ్ 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుండి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి పోటీ చేశారు. ఇక టీడీపీ, మిగతా పార్టీల ఉనికి దాదాపుగా లేనట్లేనని చెప్పవచ్చు.
ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు 65 శాతం ఉన్నారు.. ఇక్కడ ఏ ఎన్నికలు వచ్చినా బీసీ ఓటర్లే కీలకంగా మారనున్నారు.
సెగ్మెంట్ ప్రధాన సమస్యలు
1). పటాన్ చెరు పారిశ్రామికవాడలో పొల్యూషన్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. వేలాది పరిశ్రమలు ఉండగా పలు పరిశ్రమలు జల, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలపై పొల్యూషన్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
2). నియోజకవర్గం హైద్రాబాద్ ను ఆనుకుని ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం వల్ల భూముల విలువలు బాగా పెరిగాయి. ఈ క్రమంలో పటాన్ చెర్, రాంచంద్రాపూర్, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ భూముల కబ్జాలు గురవుతున్నాయి.
3). భీరంగూడ – కిష్టారెడ్డిపేట రోడ్డు అధ్వాన్నంగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
4). పాలిటెక్నిక్ కాలేజీ
5). పటాన్ చెరు వరకు రైల్ సదుపాయం
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2014 | Gudem Maipal Reddy | TRS | 73986 | M Sapanadev | TDP | 55100 |
2009 | T. Nandeshwar Goud | INC | 34329 | M. Sapanadev | TDP | 41269 |