సంగారెడ్డి నియోజకవర్గం :
మండలాలు; సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్.
ఎమ్మెల్యే: తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) కాంగ్రెస్.
ఎమ్మెల్యే జగ్గారెడ్డిలో మునపటి జోష్ ఇప్పుడు కనిపించడంలేదు. ఇదివరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగే వారు. కాగా కొన్నాళ్లుగా ఆయన వ్యవహార శైలి, మాట తీరులో మార్పు వచ్చింది. ఇక టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియోజకవర్గంలో ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో బీజేపీ లీడర్లలో, క్యాడర్లో జోష్ పెరిగింది.
సంగారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.
సెగ్మెంట్ ప్రధాన సమస్యలు:
1) తాగునీటి సమస్య
2) పొల్యూషన్
3) రోడ్లు
4) నిరుద్యోగ సమస్య
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | Jagga Reddy | INC | 76572 | Chinta Prabhakar | TRS | 73983 |
2014 | Chinta Prabhakar | TRS | 82860 | Jayaprakash Reddy .T | INC | 53338 |
2009 | Jaya Prakash Reddy .T | INC | 41101 | Chinta Prabhaker | TDP | 34329 |