నారాయణపేట నియోజకవర్గం
మండలాలు; నారాయణపేట, ధన్వాడ, మరికల్, కోయిలకొండ, దామరగిద్ద
ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి (టీఆర్ఎస్)
గతంలో టిడిపి కోటాగా ఉన్న నారాయణపేటలో 2014లో టిడిపి నుండి ఎస్.రాజేందర్రెడ్డి గెలిచి తరువాత 2016లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇండిపెండెండ్ అభ్యర్ధగా ఉన్న శివకుమార్రెడ్డిపై 15వేల మెజార్టీలో గెలుపొందారు. . వచ్చె ఎన్నికల్లో ముడోసారి టీఆర్ఎస్ టికెట్‌పై పోటికి అసక్తి చూపిస్తున్నారు.
అయితే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీకి రెండవ స్థాయి నాయకుడు టిఆర్ఎస్ పార్టీలో లేరు. టిఆర్ఎస్ పార్టీ నుండి 2014లో పోటీ చేసిన శివకుమార్ రెడ్డి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరగా 2018 ఎన్నికల్లో టికెట్ రాకపోవటంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు.
బిజెపి పార్టీ నుండి గతంలో రెండు సార్లు రతంగ్పాండురెడ్డి పోటీ చేసినా 20 వేల వరకు ఓట్లు మాత్రమే సాధించారు. ఇపుడు బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి సత్యయాదవ్ పోటీ చేయటానికి ఆసక్తి కనపరుస్తున్నారు. నియోజవర్గంలో యూత్లో మంచి క్రెజ్తో ముందుకెళ్తున్నారు. అలాగే సమస్యలపై పోరాడుతున్నారు. ప్రజాల దగ్గరికి ఇప్పడి నుండే సత్సంబందాలతో ముందుకెళ్తున్నారు.
ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. దళితులు, లంబాడ గిరిజనులు కూడ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం తక్కువగా ఉన్న..అన్ని క్యాస్ట్లను ప్రభావితం చేస్తారు.
నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు;
@నారాయణపేట నియోజకవర్గానికి సాగునీరు ఇస్తామని పాలకులు చెబుతున్నా ఇంతవకు ఎవరూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లేదు. ముఖ్యంగ ఇక్కడ జివో 69తో నీరు తీసుకుని రావాలని పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
@నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేవు. ఇండస్ర్టీలు అయితే ఉపాది దొరుకుతుందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.
@విద్యావ్యవస్థ అభివృద్ది లేదు. ముఖ్యంగా పిజి కళాశాల, వృత్తి విద్యా సంస్థలు వంటివి తీసుకువస్తామని నాయకులు మాట ఇచ్చిన వాటిని సాధించటం లేదు.
@వైద్య పరంగా వెనకబడిన నారాయణపేటకు పేరుకు జిల్లా ఆస్పత్రిగా మారినా అందులో పిహెచ్సి స్థాయి వైద్యం అందుతుందే తప్ప సౌకర్యాలు అస్సలు లేవు.
@గ్రామీణ స్థాయిలో రవాణ వ్యవస్థ సరిగ్గా లేదు. రోడ్ల వ్యదస్థ ఇంకా దుర్బరంగానే ఉంది.
@ధన్వాడ మండలంలో కొయిల్సాగర్ బ్యాక్ వాటర్ నుండి చెరువులకు నీరందిస్తే సాగు పెరిగే అవకాశాలు ఉన్న నాయకులు మాటిచ్చి మరిచారు.
Narayanpet Election Result 2018
Candidate Name | Party | Votes |
S.RAJENDER REDDY | Telangana Rashtra Samithi | 68767 |
K.SHIVAKUMAR REDDY | Bahujana Left Party | 53580 |
K.RATHANGA PANDU REDDY | Bharatiya Janata Party | 20111 |
KRISHNA SARAF BANGARU BALAPPA | Indian National Congress | 6344 |
G.SANJEEVA REDDY | Telangana Congress Party | 3989 |
J.NAVITHA | Telangana Inti Party | 3636 |
KISTA REDDY | Independent | 1011 |
BODHIGELI SRINIVASULU | Bahujan Samaj Party | 882 |
K.RAAJU | Aam Aadmi Party | 825 |
PATEL RAMCHANDRA REDDY | Independent | 661 |
None of the Above | None of the Above | 1948 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | S.RAJENDER REDDY | TRS | 68767 | K.SHIVAKUMAR REDDY | Bahujana Left Party | 53580 |
2014 | S.Rajender Reddy | TDP | 40107 | K.Shivakumar Reddy | TRS | 37837 |
2009 | Yelkoti Yella Reddy | TDP | 45945 | Sugappa | INC | 33802 |