భువనగిరి నియోజకవర్గం BUNAGIRI

భువనగిరి నియోజకవర్గం:
మండలాలు: భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి 

పైళ్ల శేఖర్​రెడ్డి (టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే)
వరుసగా 2014, 2018లో శేఖర్​రెడ్డి టీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Bhongir Election Results 2018

2018 Assembly Elections.

Candidate NamePartyVotes
PAILLA SHEKAR REDDYTelangana Rashtra Samithi85476
ANIL KUMAR REDDY KUMBAMIndian National Congress61413
JITTA BALAKRISHNA REDDYYuva Telangana Party13427
POCHAMPALLY RAMANA RAOSamajwadi Forward Bloc3613
KALLURI MALLESHAM YADAVCommunist Party of India (Marxist)1856
ALAKUNTLA YELLAIAHIndependent1758
DEVARAKONDA HANUMANTHUIndependent1305
BELLY KRISHNABahujan Samaj Party924
PATNAM KAMALA MANOHARIndependent616
GUNDALA LAXMINARAYANA GOUDIndependent564
UPENDER GUPTA PABBAShiv Sena225
MANCHALA MAHESHWARTelangana Labour Party204
BHONGIR SRINIVAS NETHASamajwadi Party197
NAGA RAJU GUPTA BEJUGAMTelangana Praja Samithi (Kishore, Rao and Kishan)163
DHARAVATH GANESH NAYAKBahujan Mukti Party143
None of the AboveNone of the Above1347

SITTING AND PREVIOUS MLAS

YearWinner Candidates NamePartyVotesRunner UPPartyVotes
2018PAILLA SHEKAR REDDYTRS85476ANIL KUMAR REDDY KUMBAMINC61413
2014Pailla Shekar ReddyTRS54686Jitta Bala Krishna ReddyYTP39270
2009Alimineti Uma Madhava ReddyTDP53073Jitta Bala Krishna ReddyIND43720
2004Smt Alimineti Uma Madhava ReddyTDP66602Ale NarendraTRS49066


నియోజకవర్గంలో పద్మశాలి, గౌడ్స్, కురుమ, మున్నూరు కాపు, ముదిరాజ్ కులాలకు చెందిన వారి జనాభా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఎస్సీ కులాలకు చెందిన జనాభా ఉంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదు.  1985 నుంచి 2004 వరకూ ఎలిమినేటి మాధవరెడ్డి, ఉమా మాధవరెడ్డి ఎమ్మెల్యేలుగాఉంటే.. గత రెండు ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ నుంచి  పైళ్ల శేఖర్​ రెడ్డి గెలిచారు.

భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి ఒంటెత్తు పోకడల అంతర్గతంగా పార్టీ లీడర్లు అసంతృప్తిగా ఉన్నారు. శేఖర్​రెడ్డి ఎన్నికల టైమ్​లో డబ్బులు కుమ్మరించే గెలిచే సత్తా ఉన్న లీడర్​గా పేరుంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​ లో  చేరిన చింతల వెంకటేశ్వరరెడ్డి ఇక్కడ  టికెట్​ ఆశిస్తున్నారు. నయీం కేసుల కారణంగా టీఆర్ఎస్ లో చేరారు.

ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి టీఆర్​ఎస్​లో చేరిన తర్వాత పార్టీలో గ్రూప్​లు పెరిగాయి.  ఆమె కొడుకు సందీప్​రెడ్డి  యాదాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన వర్గం బలం పెరుగుతోంది.

కాంగ్రెస్  నుంచి  డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​ కుమార్​రెడ్డి, పోత్నక్ ప్రమోద్​ కుమార్​ టికెట్​ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అనిల్​కుమార్​రెడ్డి టీఆర్​ఎస్​కు గట్టి పోటీ ఇచ్చారు.  

బీజేపీకి ఇక్కడ చెప్పుకోదగ్గ బలం లేదు. ఈ మధ్యే కాంగ్రెస్ నుంచి గూడూరు నారాయణరెడ్డి బీజేపీలోచేరారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ మద్దతుతో 2018 ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా  జిట్టా బాలకృష్ణారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2009 లో ఇండిపెండెట్​గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన జిట్టా  ఓటు బ్యాంకు క్రమంగా పడిపోయింది.

వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా వడ్లోజు వెంకటేశ్ ఉన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here