గజ్వేల్ నియోజకవర్గం :
మండలాలు; గజ్వేల్, కొండపాక, జగదేవ్ పూర్, మర్కుక్, వర్గల్, ములుగు, తుఫ్రాన్, మనోహరాబాద్
ఎమ్మెల్యే: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు టీఆర్ఎస్ పార్టీ
గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం వున్నా, బీజెపీ తో పాటు ఇతర పార్టీల నుంచి ముఖ్య లీడర్లు ఎవరు లేరు. గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ప్రభావం చూపుతారు. వీరిలో ముదిరాజ్ ఒట్లు కీలకంగా మారతాయి. నియోజకవర్గం పరిధిలో దాదాపు 60 వేల ముదిరాజ్ ఓట్లు వున్నాయి.
+ గజ్వేల్ నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాల్లో కొన్ని సమస్యలు ప్రజల్ని పీడిస్తున్నాయి.
+ నియోజకవర్గ కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో మౌలిక వసుతలతోపాటు సిబ్బంది కొరత కారణంగా వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.
+ నియోజకవర్గంలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వుంది. నియోజకవర్గంలో ఉపాథి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
+ ముఖ్యంగా కొండపొచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజక్టుల నిర్వాసితులు ఉపాథి లేక తీవ్ర సమస్య ఎదుర్కొంటుండగా, ఆర్ అండ్ ఆర్ కాలనీలో సరైన విధంగా మౌలిక వసతులు లేక ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. నియోజకవర్గంలో పశు వైద్యం సక్రమంగా అందక పోవడం వల్ల పశువులు, గొర్రెల పెంపకం దార్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
+ నియోజకవర్గంలోని యువతకు ఉపాథి కల్పించే పరిశ్రమాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెలుతున్నారు.
Gajewal(Telangana) Electiion Result 2018
Candidate Name | Party | Votes |
KALVAKUNTLA CHANDRASHEKAR RAO | Telangana Rashtra Samithi | 125444 |
VANTERU PRATAP REDDY | Indian National Congress | 67154 |
KANTE SAYANNA | Independent | 3353 |
BITLA VENKATESHWERLU | Independent | 1636 |
AKULA VIJAYA | Bharatiya Janata Party | 1587 |
YADAGIRI PEDDASAIGARI | Independent | 1350 |
GURRAPU RAMULU | Independent | 1229 |
KANAKAIAH GAJJELA | Bahujan Samaj Party | 1023 |
JEEDIPALLY SRINIVAS | New India Party | 892 |
KADIUM KRUPAKAR | Independent | 877 |
P.SATHISH | Independent | 810 |
SRINIVAS SREERAMULA | Bahujana Left Party | 315 |
EMAMPURAM YADAGIRI GOUD | Independent | 226 |
None of the Above | None of the Above | 1624 |
Sitting and previous MLAs
.
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | Kalvakuntla Chandrashekar Rao | TRS | 125444 | Pratap Reddy Vanteru | INC | 67154 |
2014 | Kalvakuntla Chandrashekar Rao | TRS | 86694 | Pratap Reddy Vanteru | TDP | 67303 |
2009 | Tumkunta Narsa Reddy | INC | 74443 | Lasmannagari Prathap Reddy | TDP | 67268 |
2004 | Jetty Geetha | INC | 71955 | D.Durgaiah | TDP | 47695 |