భద్రాచలం నియోజకవర్గం
మండలాలు; భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, చెర్ల. దుమ్ముగూడెం
ప్రస్తుత ఎమ్మెల్యే: పొడెం వీరయ్య (కాంగ్రెస్)
ఎమ్మెల్యే పొదెం వీరయ్య టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. ఇతనిపై వ్యతిరేకత లేదు. కాంగ్రెస్, టీడీపీలకు ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కలిసొచ్చే అంశం. దీనికి తోడు మావోయిస్టుల నుంచి సపోర్టు ఉంది. గత ఎన్నికల్లో కేవలం 13 రోజుల్లోనే టిక్కెట్ తెచ్చుకుని గెలిచారు. ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది.
టీఆర్‍ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే బలమైన నాయకుడు. ఇక్కడ గ్రూపు తగాదాలు వెంటాడుతున్నాయి. ఎంత బలమైన క్యాండిడేట్‍ను పెట్టినా టీఆర్ఎస్‍కు ప్రతికూలమే. ఆంధ్రాలో విలీనమైన అయిదు పంచాయతీలను తిరిగి తీసుకురావాలని అసెంబ్లీలో వీరయ్య ఫైట్ చేస్తున్నా స్పందన లేదు. భద్రాద్రి రామయ్యకు రూ.100 కోట్లు ఇవ్వలే. ఇవన్నీ అధికార పార్టీకి కష్టకాలమే.
సీపీఎం నుంచి మాజీ ఎంపీ మిడియం బాబూరావు పోటీ చేసే అవకాశముంది. గట్టి పోటీ ఇచ్చే అవకాశముంటుంది. బీజేపీ నుంచి కుంజ సత్యవతి పోటీలో ఉండే అవకాశాలున్నాయి.
పోడు సమస్య ప్రధానమైనది
Bhadrachalam Election Results 2018
Bhadrachalam 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
PODEM VEERAIAH | Indian National Congress | 47746 |
TELLAM VENKATA RAO | Telangana Rashtra Samithi | 35961 |
MIDIYAM BABU RAO | Communist Party of India (Marxist) | 14228 |
PANDRA HEMASUNDAR | Independent | 4523 |
KUNJA SATYAVATHI | Bharatiya Janata Party | 1824 |
RAMESH BABU BHUKYA | Pyramid Party of India | 1119 |
CHELE ANUSHA | Independent | 835 |
PUNEM PRADEEP KUMAR | Republican Party of India | 816 |
KARAM NAVEEN | Independent | 698 |
GUNDU SARATH BABU | Bahujan Samaj Party | 589 |
None of the Above | None of the Above | 2106 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | PODEM VEERAIAH | INC | 47746 | TELLAM VENKATA RAO | TRS | 35961 |
2014 | Sunnam Rajaiah | CPM | 57750 | K.P.R.K. Phaneeswaramma | TDP | 55935 |
2009 | Kunja Satyavathi | INC | 51466 | Sunnam Rajaiah | CPM | 45083 |
2004 | Sunnam Rajaiah | CPM | 64888 | Sode Ramaiah | TDP | 50303 |