మీకు తెలుసా.. అసలు గ్యాంగ్ లీడర్ నాగబాబు

మెగాస్టార్ చిరంజీవికి పూర్తిగా మాస్ ఫాలోయింగ్ తీసుకువచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో! రఫ్ ఆడించేస్తానంటూ చిరంజీవి నిజంగానే ఇండస్ట్రీని రఫాడించారు. విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవి సరసన విజయశాంతి హీరోయిన్‌‌గా నటించగా మురళీ మోహన్, శరత్ కుమార్, సుమలత కీలక పాత్రాలు పోషించారు.

మాగంటి రవీంద్రనాధ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించగా బప్పీలహరి మ్యూజిక్ అందించారు. 1991 మే 9న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక సినిమాల్లో చిరు వేసుకున్న షర్ట్స్ బాగా పాపులర్ అయ్యాయి. గ్యాంగ్‌‌లీడర్ షర్ట్స్ పేరుతో మార్కెట్‌‌లో అమ్మారు.

అయితే ముందుగా ఈ సినిమాని చిరంజీవి తమ్ముడు నాగబాబుతో చేయాలని అనుకున్నారట దర్శకుడు విజయ బాపినీడు. అయితే అప్పుడది ఫ్యామిలీ డ్రామా.. ఒకప్పుడు తాను తీసిన ‘బొమ్మరిల్లు’ (’78) ప్రేరణతో, నాగబాబుతో ఓ సినిమా తీయాలనుకున్నారు. ‘షోలే’ సినిమాలోని అమ్జాద్‌ ఖాన్‌ డైలాగ్‌ ప్రేరణతో ‘అరె ఓ సాంబా’ అని టైటిల్‌ పెట్టాలనుకున్నారు. అయితే అదే సమయంలో చిరంజీవి నుంచి సినిమా చేద్దామని పిలుపు రావడంతో ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్‌ జోడించి గ్యాంగ్‌‌లీడర్ పేరుతో సినిమా తీశారు విజయ బాపినీడు. సినిమా సూపర్ డూపర్ హిటై మాస్ హీరోగా చిరంజీవికి ఎక్కడ లేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది.

ఇదే సినిమాని తమిళ్‌‌లో డబ్ చేయగా అక్కడ సూపర్ హిట్ అయింది. అక్కడ చిరుకి సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. ఇక హిందీలో రవిరాజా పినిశెట్టి ఈ సినిమాని రీమేక్ చేయగా అక్కడ కూడా చిరునే నటించారు. హీరోయిన్‌‌గా మీనాక్షి శేషాద్రి నటించింది. హిందీ రీమేక్‌‌లో చిరంజీవి ఫ్రెండ్ పాత్రను రవితేజ చేయడం విశేషం. అక్కడ కూడా ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. హిందీలో చిరంజీవికి ఇది రెండో విజయం. అంతకుముందు రాజశేఖర్ నటించిన అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధ్‌ పేరుతో రీమేక్ చేశారు చిరు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here