మక్తల్​ MAKTHAL

మక్తల్​ నియోజకవర్గం

మండలాలు;మక్తల్​, మాగనూర్​, క్రిష్ణ, ఊట్కూర్​, నర్వ, అమరచింత, ఆత్మకూర్​

ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మెహన్​రెడ్డి (టిఆర్​ఎస్)

కాంగ్రెస్​కు మంచి పట్టున్న మక్తల్​ నియోజకవర్గంలో 2014లో కాంగ్రెస్​ నుండి గెలిచిన చిట్టెం రాంమ్మెహన్​రెడ్డి 2017లో టిఆర్​ఎస్​ పార్టీలో చేరారు. తరువాత 2018 ఎన్నికల్లో టిఆర్​ఎస్​ పార్టీ టికెట్​పై పోటీ చేసి విజయం సాధించారు. ఇండిపెండెంట్​ అభ్యర్థి జలందర్​రెడ్డిపై 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ సాదించారు.

టిఆర్​ఎస్​ పార్టీ నుండి వర్కటం జగన్నాధ్​రెడ్డికి సెకండ్​ లీడర్​గా ఉన్నా ఎక్కువగా ప్రజలతో లేకపోవటంతో వీరు టికెట్​ కోసం ప్రయత్నించినా వచ్చే అవకాశాలు లేవు. గత ఎన్నికల్లో టిర్​ఎస్​ నుండి టికెట్​ ఆశించిన జలందర్​రెడ్డి ఇండిపెండెంట్​గా పోటీచేశారు. ఈసారి బిజెపిలో ఉండి ప్రజల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని బిజెపి టికెట్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్​ నాయకులు పార్టీలోకి తీసుకుని టికెట్​ ఇస్తామని చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.  బిజెపి నుండి కొండయ్య గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి కూడా టికెట్​కోసం పోటీ డనునన్నారు. 2018  ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్​ పొత్తులో భాగంగా కొత్తకోట దయాకర్​రెడ్డికి టికెట్​ ఇచ్చారు. మూడవ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ సారి దయాకర్​రెడ్డి కాంగ్రెస్​లో పోయే అవకాశలు  ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్​లో చేరితే  టికెట్​ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  కాంగ్రెస్​ నుండి రాజుల ఆశిరెడ్డి, వాకిటి శ్రీహరిలు టికెట్​ రేసులో ఉన్నారు. 

ఈ నియోజకవర్గంలో బీసీలదే హవా..ఎస్సీ ఓటర్లు కూడ డిసైడ్​ ఫ్యాక్టర్స్​గా ఉన్నారు. కాని రాజకీయ ఆధీపత్యం రెడ్డిలదే కోనసాగుతుంది.

మక్తల్​ ప్రధాన సమస్యలు…

@నియోజకవర్గంలో చాలా గ్రామాలకు మిషన్​ భగీరథ పనులు పూర్తి కాకపోవటంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

@నియోజకవర్గంలో విద్యాసంస్థలు లేవు. కేవలం ఇంటర్​ వరకు మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలు ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాయకులు ఈ విషయంపై హామిలు ఇచ్చినా అమలు కావటం లేదు.

@ఆర్టిసి డిపో కోసం ఏళ్లుగా పోరాడుతున్నా, ప్రజాప్రతినిధులు హామి ఇస్తున్నా అమలు కావటం లేదు.

@మక్తల్​ను రెవిన్యూ డివిజన్​ చేస్తే ఇక్కడ ఇంకా అభివృద్ది చెందుతుందని భావిస్తున్నా అది నెరవేరటం లేదు.

@ఊట్కూర్​ మండలానికి సంగంబండ నుండి సాగునీరు ఇస్తామని ఏళ్ళుగా హామిలు ఇస్తామన్నా అమలు కావటం లేదు.

Makthal Election Result 2018

Candidate NamePartyVotes
CHITTEM RAMMOHAN REDDYTelangana Rashtra Samithi78686
JALANDER REDDYIndependent30371
K. DHAYYAKKAAR REDDYTelugu Desam26579
KONDAIAHBharatiya Janata Party20242
KORI MAREPPABahujan Samaj Party1944
G. RAVI KUMAR YADAVIndependent1349
G.VENKATRAM REDDYBahujana Left Party1190
JUTLA SRINIVASULUIndependent1111
SUDHARSHANAll India Samata Party790
RAMESH KUMAR BANDARISamajwadi Party575
None of the AboveNone of the Above2106

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018CHITTEM RAMMOHAN REDDYTRS78686JALANDER REDDYIndependent30371
2014Chittem Ram Mohan ReddyINC51632Yelkoti Yella ReddyTRS41605
2009K.Dayakar ReddyTDP53261Chittem Ram Mohan ReddyINC47560
2005Chittemram Mohan ReddyINC64878SugappaIND24799
2004Chittem Narsi ReddyINC55375Nagurao NamajiBJP53019

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here