టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అంజలి, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రాల్లో కనిపించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా 2013 సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే ఇందులో ఈ సినిమాలో సీత పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లుగా అనుకున్నారు. ముందుగా త్రిష, స్నేహా, భూమిక, అనుష్కలను అనుకున్నారు. చివరకి అమలపాల్ ని తీసుకున్నారు. ఆమె కూడా సినిమా చేయడానికి సైన్ చేసింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె స్థానంలో అంజలిని తీసుకున్నారు. సీత పాత్రలో అంజలిని తప్ప మరొకరిని ఊహించుకోలేము కూడా… అంతగా సూట్ అయింది అంజలి. ఇక రేలంగి మావయ్య పాత్రకి ముందుగా స్టార్ హీరో రాజశేఖర్ ని అనుకున్నారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేశారు.
ఇక ముందుగా ఈ సినిమాని మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నారు శ్రీకాంత్ అడ్డాల.. కానీ పవన్ ప్లేస్ లోకి వెంకటేష్ వచ్చారు. ఈ సినిమాకి సింగిల్ సిట్టింగ్ లోనే వెంకీ, మహేష్ లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 54.75 కోట్ల కలెక్షన్లను సాధించింది.