కన్నడ చంటి.. లక్షల్లో హక్కులు.. కోట్లల్లో లాభాలు

తమిళ్ లో వచ్చిన చిన్నతంబి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పి వాసు డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంలో ప్రభు, ఖుష్బూ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 12 ఏప్రిల్ 1991లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనంతరం ఈ చిత్రాన్ని 1991లో కన్నడలో రామాచారిగా, 1992లో తెలుగులో చంటిగా , 1993లో అనకుగా రీమేక్ చేశారు. అయితే తెలుగు,హిందీ భాషల్లో ఒక్కరే హీరో కావడం విశేషం.

అయితే ఇక్కడ కన్నడ వెర్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. రవిచంద్రన్ దీనిని రీమేక్ చేశారు. అప్పుడు శాంతి క్రాంతి అనే భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నారు రవిచంద్రన్. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. షూటింగ్ పూర్తి కావొస్తున్న టైంకి రవిచంద్రన్ కి ఈ సినిమా ఆడదని అర్థమైపోయింది. పైగా తన తండ్రిని ఆపరేషన్ కోసం అమెరికా తీసుకెళ్లాలి. దానికీ డబ్బులు కూడా లేవు. ఈ క్రమంలో ఆయనను ఆదుకునే ఓ హిట్ సినిమా కావాలి.

దీంతో ఆయన అప్పుడే తమిళ్ లో బ్రహ్మండంగా ఆడుతున్న చిన్నతంబి సినిమా గురించి విన్నారు రవిచంద్రన్. చెన్నైకి వెళ్లి ఈ సినిమా చూశారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సినిమా కావడం, ఇలాంటి సినిమాలకు కన్నడలో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ సినిమాను చేయాలనుకున్నారు. వెంటనే హీరోయిన్ ఖుష్బూకు ఫోన్ చేసి రీమేక్ హక్కుల కోసం చిన్నతంబి తమిళ నిర్మాతను అడగమన్నారు. కేవలం లక్ష రూపాయలకు డీల్ కుదిరేలా సహాయం చేసింది.

కానీ రవిచంద్రన్ దగ్గర 35 వేలే ఉన్నాయి. ఇంకా 65 వేలు కావాలి. కోట్లు మార్చిన చేతులవి. ఇప్పుడు వేలకు దేహీ అనే దుస్థితి. స్నేహితులు డిస్ట్రిబ్యూటర్లను అడిగి ఏదోలా కిందా మీద చేసి మిగిలిన డబ్బు సర్దేశారు. శాంతి క్రాంతి పక్కన పెట్టి రామాచారి టైటిల్ తో చిన్నతంబి రీమేక్ ని వేగంగా తీశారు.

హీరోయిన్ గా ఖుష్బూనే చెయమంటే ఆమె ఫుల్ బిజి అయిపోయారు. దీంతో మాలాశ్రీని హీరోయిన్ గా తీసుకున్నారు. దర్శకత్వం తనే చేయగలిగినా ఒత్తిడి తట్టుకోలేక ఆ బాధ్యతను రాజేంద్రబాబుకి అప్పగించారు రవిచంద్రన్. హంసలేఖ అద్భుతమైన పాటలు ఇచ్చారు. 1991 జూలై 17న రిలీజ్ చేస్తే ఈ సినిమాకు థియేటర్ల వద్ద ప్రేక్షకులు క్యూ కట్టారు. ఈసినిమా సక్సెస్ రవిచంద్రన్ కు కొన్ని కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here