కోదాడ నియోజకవర్గం KODAD

కోదాడ నియోజకవర్గం :
మండలాలు :  కోదాడ మున్సిపాలిటీ, కోదాడ రూరల్‌‌మండలం, అనంతగిరి, చిలుకూరు,మునగాల, నడిగూడెం, మోతె.

ఎమ్మెల్యే  : బొల్లం మల్లయ్యయాదవ్‌‌(టి‌ఆర్‌ఎస్)

Kodad Election Results 2018

2018 Assembly Elections.

Candidate NamePartyVotes
BOLLAM MALLAIAH YADAVTelangana Rashtra Samithi89115
PADMAVATHI REDDY NALAMADAIndian National Congress88359
ANJI YADAVIndependent5240
BURRI SRIRAMULUCommunist Party of India (Marxist)3381
KUNDURU DEVENDER REDDYTelangana Inti Party1508
JALLEPALLI ENKATESHWARLUBharatiya Janata Party1485
VELANGI RAJU ORSUBahujan Samaj Party741
PANDITI KRANTHI KUMARIndependent610
SHAIK MASTAN SAHEBIndependent530
GIDDE RAJESHIndependent506
PANDI PEDDA TIRUPATHAIAHIndependent327
AMBEDKAR DUNNAJai Swaraj Party287
PARYAVARANAM KOLLU LAKSHMINARAYANAIndependent265
DAIDA LINGAIAHIndependent171
GANGIREDDY KOTIREDDYIndependent123
None of the AboveNone of the Above1240

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018BOLLAM MALLAIAH YADAVTRS89115PADMAVATHI REDDY NALAMADAINC88359
2014Padmavathi Reddy NalamadaINC81966Bollam Mallaiah YadavTDP68592
2009Chander Rao VenepalliTDP64742Md.Mahaboob JaniINC54918
2004Uttam Kumar Reddy NalamadaINC88178Chander Rao VenepalliTDP64391

గత ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన ఉత్తమ్​ భార్య నలమాద పద్మావతిపై  బొల్లం మల్లయ్యయాదవ్‌‌ స్వల్ప ఓట్లతో గెలిచారు. కేవలం 756 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ప్రస్తుతం నియోజకవర్గంలో టీఆర్​ఎస్ కు ఎడ్జ్​ ఉంది. గత ఎన్నికల్లో  మల్లయ్యయాదవ్‌‌గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌రావు, ఎర్నేని బాబు, మహబూబ్‌‌జాని, పాండురంగారావు కలిసికట్టుగా పనిచేశారు. తర్వాత వీరి మధ్య వీరిమధ్య సంబంధాలు  బెడిసి కొట్టాయి. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని వీరంతా పార్టీ హైకమాండ్‌‌కు ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్​ ఇక్కడ పోటాపోటీ పడేందుకు అవకాశాలున్నాయి.  కాంగ్రెస్​ నుంచి ఉత్తమ్‌‌, లేదా ఆయన భార్య మళ్లీ పోటీ చేసే అవకాశాలున్నాయి.  బీసీల నుంచి పార సీతయ్య పేరు ‌పరిశీలనలో ఉంది. మోతె మండలానికి చెందిన కొండపల్లి పవన్‌‌కుమార్‌‌రెడ్డి ఐఎన్‌‌టీయూసీ రాష్ర్ట నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్​పై ఆసక్తితో ఉన్నారు.

బీజేపీ ఇక్కడ ఆశాజనకంగా లేదు. గ్రూపు తగాదాలతో రెండు వర్గాలుగా చీలిపోయారు. కనగాల వెంకట్రామయ్య, నూనె సులోచనలు సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారు. కానీ కేడర్​ పెంచుకోలేక పోయారు. 2018 ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఓర్సు వేలంగి రాజు  బీజేపీలో చేరిన తర్వాత గ్రూపులు ఏర్పడ్డాయి. దీంతో పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహించే పరిస్థితి.


నియోజకవర్గంలో మాదిగ, రెడ్డి కులాల తర్వాత, ఎస్టీల ఓట్లు ఎక్కువ. 

నియోజకవర్గంలో సమస్యలు;.

@ కోదాడ పెద్ద చెరువు ఆక్రమణలను అడ్డుకుని దానిని రిజర్వాయర్‌‌గా మార్చడం,

@  టౌన్​లో ట్రాఫిక్‌, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడం, రోడ్లపై వ్యాపారాలు చేసే వారికి శాశ్వత దుకాణాలు కేటాయించడం

@ రైస్‌‌మిల్లుల కాలుష్యం నుండి సాలార్జంగ్‌‌పేట వాసులకు రక్షణ కల్పించడం

@  ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేయలేదు.

@ క్రీడాకారుల కోసం అన్ని సౌకర్యాలతో స్టేడియం నిర్మాణం చేస్తామన్న హామీ అమలు కాలేదు.

@  చెక్‌‌డ్యాంలు నిర్మించి, చివరి భూములకు నీరందిస్తామని చెప్పిన ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు.

@ పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌‌మార్కెట్‌‌నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు.

@ మోతె మండలంలో వెనుకబడిన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, రహదారి సౌకర్యం కల్పించలేదు.

@ పేదలకు డబుల్‌‌బెడ్‌‌రూం ఇళ్ళు ఇస్తమని చెప్పి, వాటిని కొన్ని గ్రామాలలో నిర్మించినా వాటికి అలబ్దిదారులకు అందజేయలేదు. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో వాటని వాటిని పంపిణీ చేశారు.

@ కొత్త లిఫ్టుల నిర్మాణం జరగలేదు.ఉన్న లిఫ్టులకు మెయింటెనెన్స్‌‌ఇవ్వకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here