హుజూర్​నగర్​ నియోజకవర్గం HUZURNAGAR

హుజూర్‌నగర్ నియోజకవర్గం :

మండలాలు; హుజూర్‌నగర్ , మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచెర్ల, మేళ్లచెర్వు, పాలకవీడు, చింతలపాలెం(మల్లారెడ్డిగూడెం) , హుజూర్‌నగర్,  నేరేడుచెర్ల మున్సిపాలిటీ లు.

ఎమ్మెల్యే: శానంపూడి సైదిరెడ్డి (టీఆర్‌ఎస్)

Huzurnagar By-Election 2019 Result

Winner partyRunner uppartyMargin
Saidi Reddy ShanampudiTRSNalamada Padmavathi ReddyINC23494

Huzurnagar Election Results 2018

2018 Assembly Elections

Candidate NamePartyVotes
UTTAM KUMAR REDDY NALAMADAIndian National Congress92996
SANAMPUDI SAIDIREDDYTelangana Rashtra Samithi85530
RAGHUMAREDDY MEKALAIndependent4944
PAREPALLY SEKHAR RAOCommunist Party of India (Marxist)2121
BOBBA BHAGYA REDDYBharatiya Janata Party1555
RAMESH SUNKARAIndependent1454
DASARI SRINIVASARAOBahujan Samaj Party1018
KALVAKUNTLA RAMAIAHIndependent736
BALU GUGULOTHUIndependent727
MEDARI VEERAIAHIndependent420
DESHAGANI SAMBASHIVA GOUDTelangana Prajala Party413
B. PADMAIndependent260
MUDEM KOTIREDDYIndependent210
BANDARU NAGARAJUIndependent170
SAMULA SIVA REDDYAll India Forward Bloc155
MALOTHU GOVIND NAIKAam Aadmi Party135
None of the AboveNone of the Above1621

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018UTTAM KUMAR REDDY NALAMADAINC92996SANAMPUDI SAIDIREDDYTRS85530
2014Uttam Kumar Reddy NalamadaINC69879Kasoju ShankarammaTRS45955
2009Nalamada Uttam Kumar ReddyINC80835Jagadeesh Reddy GuntakandlaTRS51641


2018లో ఇక్కడ కాంగ్రెస్​ నేత ఉత్తమ్​కుమార్​రెడ్డి గెలవగా… 2019 అక్టోబర్‌‌లో జరిగిన బై పోల్​ లో ఉత్తమ్​ భార్య పద్మావతిపై టీఆర్​ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. ఉత్తమ్​ ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఇక్కడ బై పోల్​ జరిగింది.


ఉప ఎన్నికతో టీఆర్ఎస్​  ఇక్కడ బలం పుంజుకుంది. కానీ  ఎమ్మెల్యే సైదిరెడ్డి గెలిచిన టైమ్​లో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదనే వ్యతిరేకత పెరిగింది. భూ ఆక్రమణదారుడనే విమర్శలు పెరిగిపోయాయి. ఉత్తమ్​కుమార్​కు బలమైన ఓటు బ్యాంక్​ ఉంది. గతంలో వైసీపీ నుంచి పోటీ చేసిన గట్టు శ్రీకాంత్​రెడ్డి ఇక్కడ బీజేపీ నుంచి పోటీకి దిగే అవకాశముంది. ఆయన చేరికతో ఇక్కడ బీజేపీ పుంజుకుంది.

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో  రెడ్డి  సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ.  తరువాత గిరిజన, దళిత లు  ముదిరాజ్, గౌడ,యాదవులు , మున్నూరుకాపు, ముస్లిం, ఆర్య వైశ్యులు, పద్మ షాలీలు, కమ్మ, పెరిక కుల  ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.


నియోజకవర్గ సమస్యలు;

. మొత్తం 141 గ్రామపంచాయతీలకు 7 మండల కేంద్రాలను తీసివేసి, మిగిలిన 134 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు. ఒక్కో మండల కేంద్రానికి రూ.30 లక్షలు.  హుజూర్‌నగర్ పట్టణానికి రూ.25 కోట్లు నేరేడుచర్ల పట్టణానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు బై ఎలక్షన్​ ప్రచారంలో సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికీ నిధులు రాలేదు.

. లంబాడాలకు నియోజకవర్గ కేంద్రంలో రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు.

 . గిరిజనుల కోసం బంజార భవన్ మంజూరు. భూమిపూజ మాత్రమే  జరిగింది .

 .  పోడు భూముల సమస్య పరిష్కరించడం. ప్రజాదర్బార్ నిర్వహించి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయడం. ఇంతవరకు  ఇవ్వలేదు ,కనీసం ఒక్క మీటింగ్ పెట్టలేదు .

 .  హుజూర్‌నగర్ లో  పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కాలేదు.

.  ఎత్తిపోతల పథకాలను రైతులపై భారం లేకుండా పూర్తి ఖర్చుతో ప్రభుత్వమే నిర్వహిస్తుంది. లిఫ్ట్ లో పనిచేసే టెక్నీషియన్ల కూడా ప్రభుత్వం జీతం చెల్లిస్తుందని చెప్పిన హామీ నెరవేరలేదు.

. అప్రోచ్ రోడ్లు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్, మేజర్ కాలువ మరమత్తులు, లైనింగ్ ప్రతి పనిని రూ.వంద కోట్లతో పూర్తి చేస్తామని పెండింగ్​లో పెట్టారు.

. కృష్ణ పట్టే లో చివరి ఎకరాకు సాగునీరు అందిస్తాం. కుర్చీ వేసుకొని కూర్చొని ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత నాదే. కనీసం విస్తీర్ణం ఎంతో తేల్చలేదు.

. హుజూర్‌నగర్ కు రింగ్ రోడ్డు సుందరమైన ట్యాంకుబండు నిర్మాణం పెండింగ్​లో నే ఉంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here