మహేశ్వరం నియోజకవర్గం:
డివిజన్లు : జిహెచ్‌ఎంసి పరిధిలోని సరూర్ నగర్,ఆర్ కె పురం డివిజన్
మున్సిపాలిటీలు; బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు, జల్పల్లి, తుక్కుగూడ
మున్సిపాలిటీలు
బీసీ, మైనారిటీ ఓటు బ్యాంకు ఈ నియోజకవర్గంలో కీలకం. ఆర్ కె పురం డివిజన్ తో పాటు సరూర్ నగర్ డివిజన్,జల్ పల్లి,తుక్కుగూడ మున్సిపాలిటీ,బాలాపూర్ మండలంలో అధికంగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఎంఐఎంకు పట్టు ఉంది.
Maheshwaram Election Results 2018
Candidate Name | Party | Votes |
PATLOLLA SABITHA INDRA REDDY | Indian National Congress | 95481 |
TEEGALA KRISHNA REDDY | Telangana Rashtra Samithi | 86254 |
ANDELA SRIRAMULU | Bharatiya Janata Party | 39445 |
KRISHNA REDDY | Samajwadi Forward Bloc | 3457 |
SHEKAR IBRAM | Bahujan Samaj Party | 2031 |
MD. JAFFAR | Independent | 1381 |
MOHAMMED MERAJ UDDIN | Independent | 708 |
SRIKANTH GUNJA | Independent | 656 |
KANKTEKAR ARUN KUMAR | Bahujana Left Party | 546 |
DUDUKA SRISAILAM | Independent | 479 |
None of the Above | None of the Above | 2171 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner | Party | Votes |
2018 | PATLOLLA SABITHA INDRA REDDY | INC | 95481 | TEEGALA KRISHNA REDDY | TRS | 86254 |
2014 | Teegala Krishna Reddy | TDP | 93305 | Malreddy Ranga Reddy | INC | 62521 |
2009 | Patlolla Sabitha | INC | 65077 | T.Krisna Reddy | TDP | 57244 |
ఎమ్మెల్యే : సబితా ఇంద్రారెడ్డి (టీఆర్‌ఎస్)
కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్ ఓడిపోయింది. టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధి పటోల్ల సభితఇంద్రారెడ్డి 9227 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2019 మార్చిలో సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అదే ఏడాది కేసీఆర్ కేబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.
వైఎస్ఆర్ హయాంలో సంక్షేమ పథకాల ప్రారంభానికి చేవెళ్ల సెంటిమెంట్ సెగ్మెంట్. చేవెళ్ల చెల్లెమ్మగా అప్పుడు రాష్ట్రమందరికి సుపరిచితమైన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో సొంత సెగ్మెంట్ లో మంత్రిపై కొంత వ్యతిరేకత ఉంది.
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కోడలు తీగల అనితరెడ్డి జిల్లా జెడ్‌పి ఛైర్మన్ గా ఉన్నారు. మీర్ పేట డిప్యూటీ మేయర్ గా ఉన్న తీగల విక్రమ్‌రెడ్డి టీఆర్‌ఎస్ లో కీలకమైన లీడర్‌గా పేరు తెచ్చుకున్నారు. 2014లో టిఆర్‌ఎస్ నుండి పోటీ చేసిన కొత్త మనోహర్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్ లోనే ఉన్నారు.
బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ పారిజాత (చిగురింత నర్సింహరెడ్డి భార్య) అసంతృప్తితో ఉన్నారు. (ఈమె కాంగ్రెస్ నుంచి గెలిచి మేయర్ పదవి కోసం టీఆర్‌ఎస్ లో చేరారు.) తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న కె. మధు మోహన్ బీజేపీ రెబెల్‌గా పోటీ చేసి గెలిచారు. ఛైర్మన్ సీటు ఇస్తామని ఆశజూపడంతో టీఆర్‌ఎస్ లో చేరారు. జల్పల్లి మున్సిపాలిటీ ఎంఐఎం అధీనంలో ఉంది. అబ్ధుల్లా మహద్ సాదీ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు బలమైన కేడర్ ఉంది. కానీ చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. డీసీసీ సి ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి,ఆర్ కె పురం డివిజన్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్‌కు పోటీ పడుతున్నారు.
బీజేపీ నుండి అందెల శ్రీరాములు యాదవ్ గత ఎన్నికల్లో ఇక్కడే పోటీ చేసి 52వేల ఓట్లు సాధించాడు. సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లలో బీజేపీ బలంగా ఉంది. ఈ రెండు డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లలో గెలిచారు. ఆర్‌కే పురం డివిజన్ లో వరుసగా రెండోసారి రాధాధీరజ్ బీజేపీ నుంచి గెలిచారు. ధీరజ్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్,ఆర్ కె పురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు.
బీఎస్పీ కూడా ఇక్కడ బోణి కొట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరకముందే బడంగ్ పేట్ డిప్యూటీ మేయర్ స్థానం బీఎస్పీ దక్కించుకుంది. ఇక్కడి డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు.