నర్సాపూర్ నియోజకవర్గం :
మండలాలు; నర్సాపూర్, హత్నూర, శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలప్‌చెడ్
ఎమ్మెల్యే: చిలుముల మదన్ రెడ్డి (టీఆర్ఎస్)
ప్రస్తుత ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి (టీఆర్ఎస్) 2014, 2018 లో వరుసగా రెండు ఎన్నికల్లో మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా గతేడాది కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యమంత్రి ఆమెకు రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయాలని ఆశిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కూడా మళ్లీ పోటీకి సిద్దంగానే ఉండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి టికెట్ ఆశిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అలాగే బీజేపీ నుంచి గత ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపీ మళ్లీ ఎన్నికల్లో పోటీకి రెడీగా ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరుగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు.
+ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ఆ తర్వాత మున్నూరుకాపులు, గౌడ్లు, ఎస్సీ ఓటర్లు ఉన్నారు.
*ప్రధాన సమస్యలు *
1). నర్సాపూర్ పట్టణంలో వివిధ డెవలప్ మెంట్ పనుల కోసం 40 కోట్లు మంజూరైనా పనులు జరగడం లేదు. అభివృద్ధి పనులు శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి.
2). నియోజకవర్గంలోని శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి, కొల్చారం మండలాల్లో వేలాది ఎకరాల భూములను పార్ట్ – బిలో పెట్టడంతో వందలాది మంది రైతులకు కొత్త పాస్ బుక్‌లు రాక రైతుబంధు సాయం అందడంలేదు. అలాగే రైతు బీమాకు నోచుకోలేకపోతున్నారు.
3). మండల పరిధిలోనే వనదుర్గా ప్రాజెక్ట్ ఉన్న కొల్చారం మండలంలోని మెజారిటీ గ్రామాలకు సాగునీటి వసతి లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. కాలేశ్వరం ప్రాజెక్ట్నుంచి కూడా నీరందించే ఏర్పాటు చేయడంలేదు.
4). కొత్తగా ఏర్పాటైన చిలప్ చెడ్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక అరకొర వసతులున్న అద్దె భవనాల్లో ఆఫీస్‌లు కొనసాగుతున్నాయి. దీంతో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
5). నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించలేదు. నర్సాపూర్ పట్టణంలో, శివ్వంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో వందలాది ఇళ్ల నిర్మాణం పూర్తయి ఎండ్లు గడుస్తున్న ఎవరికి కేటాయించకపోవడంతో పాడైపోతున్నాయి.
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2014 | Chilumula Madan Reddy | TRS | 85890 | Vakiti Sunitha | INC | 71673 |
2009 | Vakiti Sunitha Laxmareddy | INC | 73924 | Chilmula Krishna Reddy | CPI | 60650 |
2004 | Vakiti Sunita Laxma Reddy | INC | 60957 | Chilumula Madhan Reddy | TDP | 35140 |