మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్.. ఏకంగా 50 బృందాలతో ఐటీ దాడులు.. కేసీఆర్ కు నో చెప్పిన మెగాస్టార్.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే

1. మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ షాక్.. 50 బృందాలతో దాడులు

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐడీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి, ఆయన అల్లుడి నివాసంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. అయితే.. ఒకే సారి 50 బృందాలు ఆయన ఆఫీసులు, వ్యాపార సముదాయాలు, నివాసాలపై దాడులు చేస్తుండడం సంచలనంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున నుంచి ఈ దాడులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మల్లారెడ్డికి చెందిన కాలేజీలకు మహేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు.

2. కేసీఆర్​ పార్టీకి.. దూరంగా చిరంజీవి

కేసీఆర్​ కొత్తగా ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​లో చేరేందుకు మెగాస్టార్​ చిరంజీవి విముఖత ప్రదర్శించారు. కొత్త పార్టీలో భాగస్వామ్యం కావాలని కేసీఆర్​ ఇచ్చిన ఆఫర్​కు చిరంజీవి నో చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్న కేసీఆర్​.. రాజకీయపరమైన ఎజెండాపై చర్చించేందుకు ప్రగతిభవన్​కు రావాలని కేసీఆర్​ చిరంజీవికి కబురు పంపినట్లు తెలిసింది. దానికి చిరంజీవి సున్నితంగా తిరస్కరించినట్లు గులాబీ పార్టీ లో చర్చ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసి భంగపడ్డ చిరంజీవి నెక్స్ట్ పొలిటికల్​ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనేది ఇప్పటికే ఆసక్తి రేపుతోంది. తమ్ముడు పవన్​ కళ్యాణ్​ యాక్టివ్​గా ఉండటంతో.. ఆయన తీసుకునే నిర్ణయం మేరకు చిరు కొత్త అడుగులు వేస్తాడని అటు ఏపీ, ఇటు తెలంగాణలో డిస్కషన్​ జరుగుతోంది.

3. తలసాని పీఏకు ఆ కోణంలో ఈడీ ప్రశ్నలు..

విదేశాల్లోని క్యాసినోల్లో జూదం ఆడేందుకు టోకెన్లు ఎక్కడ కొనుగోలు చేశారు? లావాదేవీలు ఎలా జరిగాయి? అన్న కోణంపై దృష్టి సారించారు. సోమవారం ఈడీ ఎదుట హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్, స్థిరాస్తి వ్యాపారి బుచ్చిరెడ్డిని ప్రధానంగా ఈ అంశంపైనే ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో నేపాల్ లో జరిగిన క్యాసినోలో ఈ ఇద్దరు పాల్గొన్నట్లు ఈడీ గుర్తించింది.

4. ట్రాఫిక్​ రూల్స్​.. భారీగా ఫైన్​

హైదరాబాద్ సిటీలో వచ్చే వారం నుంచి ట్రాఫిక్ రూల్స్ ను మరింత కఠినంగా మారుతున్నాయి.రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పై ఈ నెల 28 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. రాంగ్ రూట్ లో వస్తే 1700 రూపాయలు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ పడుతుంది. నంబర్ ప్లేట్ లేకుండా  వాహనాలతో రోడ్లపై డ్రైవ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. టెంపరరీ నెంబర్ కేవలం నెలరోజుల వరకే ఉంటుంది. ఆ తరువాత ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని పోలీసులు వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే పాత చలాన్లు అన్నీ కట్టాల్సి ఉంటుంది.

5. నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీ

మునుగోడు ఎన్నిక తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గం తొలిసారి భేటీ అవుతోంది. హైదరాబాద్​లో మంగళవారం ఈ సమావేశం జరుగనుంది. రెండు రోజుల శిక్షణ తరగతుల అనంతరం ఈ మీటింగ్​ జరుగనుంది.  ఈ సందర్భంగా పలు రాజకీయ తీర్మానాలు చేయనుంది. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలను తెలియజేయటం, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం, ఎన్నికల హామీలపై సర్కార్ పై ఒత్తిడి చేయాలనే తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. ప్రజాగోస–బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, పార్లమెంట్ ప్రవాస యోజనపై చర్చించే అవకాశం ఉంది.

6. ఎల్లుండి నుంచి రైతుల ఆందోళన రూట్లో కాంగ్రెస్​

రాష్ట్రంలో రైతుల కష్టాలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి సారధ్యంలో పార్టీ నేతలు సోమవారం చీఫ్​ సెక్రెటరీ సోమేష్​కుమార్​ను కలిసి రైతుల సమస్యలపై వినతిపత్రం అందించారు. ధరణి పోర్టల్ ను ప్రభుత్వం నిర్వహించకుండా.. ప్రైవేట్​ కంపెనీలకు ధారాదత్తం చేయటంతో దుర్వినియోగమవుతుందని ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి ఆరోపించారు. 24లక్షల ఎకరాల భూముల వివరాలు ధరణిలో కనిపించడం లేదని అన్నారు. వెంటనే రైతు రుణమాఫీ చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 24వ తేదీన మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసన, 30వ తేదీన ధరణి బాధితులతో నియోజకవర్గాల్లో నిరసన, డిసెంబర్ 5వ తేదీన జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. పంతాలు, పట్టింపులతో కేసీఆర్,మోదీ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్నారు.

7. సిట్​ విచారణకు..రాని బీఎల్​ సంతోష్​

ఎమ్మెల్యేల ఫామ్​ హౌజ్​ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ విచారణకు బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్​ సంతోష్​, కేరళకు చెందిన తుషార్​, జగ్గూస్వామి హాజరు కాలేదు. కరీంనగర్​ కు చెందిన అడ్వకేట్​ శ్రీనివాస్​ ఒక్కరే హాజరయ్యారు. మరోవైపు సింగిల్​ జడ్జీ పర్యవేక్షణలోనే సిట్ విచారణ కొనసాగాలనే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. నిందితులు బెయిల్​ కోసం హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.

8.మరో వారంలో 1147 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ప్రభుత్వ బోధానాస్పత్రులు, వైద్య కాలేజీల్లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కసరత్తు పూర్తయింది. మరో వారంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

9. ఈ నెల 25 లేదా 26న బీజేపీలోకి మర్రి

కాంగ్రెస్ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన కీలక నేత మర్రి శశిధర్ రెడ్డి ఈ నెల 25 లేదా 26 తేదీల్లో బీజేపీలో చేరడం ఖాయమైనట్లు సమాచారం. సోమవారం గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన సనత్ నగర్ కు చెందిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించే సత్తా కేవలం టీఆర్ఎస్ కు మాత్రమే ఉందన్నారు.

10.రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్..

రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు శుభవార్త. త్వరలోనే మరో 119 బీసీ గురుకులాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి మరో 119 గురుకుల పాఠశాలలను అప్ గ్రేడ్ చేయనుంది ప్రభుత్వం. ఈ స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులను నిర్వహించనున్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here