నాగార్జున సాగర్ నియోజకవర్గం:
మండలాలు; పెద్దవూర, హాలియా, గుర్రంపోడు, అనుముల, నిడమనూర్, త్రిపురారం, తిరుమలగిరి, నందికొండ
మున్సిపాలిటీ; నందికొండ
Nagarjuna Sagar Election Results 2021
2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
Nomula Bhagath | Telangana Rashtra Samithi | 89804 |
JANA REDDY KUNDURU | Indian National Congress | 70932 |
P Ravi Kumar Naik | Bharatiya Janata Party | 7676 |
Muvva Arun Kumar | TeluguDesam Party | 1714 |
None of the Above | None of the Above | 499 |
Sitting and Previous MLAS
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2021 By Poll | NOMULA BHAGATH | TRS | 89804 | JANA REDDY KUNDURU | INC | 70932 |
2018 | NOMULA NARSIMHAIAH | TRS | 83655 | JANA REDDY KUNDURU | INC | 75884 |
2014 | Jana Reddy Kunduru | INC | 69684 | Nomula Narsimaiah | TRS | 53208 |
2009 | Kunduru Jana Reddy | INC | 67958 | Tera Chinnapa Reddy | TDP | 61744 |
ఎమ్మెల్యే నోముల భగత్ (టీఆర్ఎస్ పార్టీ)
గతంలో కాంగ్రెస్ కోటగా ఉన్న సాగర్లో వరుసగా రెండుసార్లు టీఆర్ఎస్ గెలిచింది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవటంతో ఈ ఏడాది (2021) జరిగిన బై ఎలక్షన్ లో ఆయన కుమూరుడు, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కె.జానారెడ్డి పై గెలుపొందారు.
టీఆర్ఎస్ లో ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, యెడవెల్లి విజయేందర్‌రెడ్డి కీలకంగా ఉన్నారు. కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం సాగర్ ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇచ్చారు.
బై ఎలక్షన్ ఓటమి తర్వాత జానారెడ్డి సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి కర్నాటి లింగారెడ్డి, రంగసాయిరెడ్డి ఇక్కడ బలంగా ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో యాదవ, గౌడ, మున్నూరుకాపు కులస్తులు ఎక్కువ. రెండో స్థానం లో ఎస్టీ ఓటర్లు, అయితే ఎస్సీ మాల, మాదిగ కలిస్తే ఎస్టీ ఓటర్లతో సమా నంగా ఉంటారు. రెడ్ల ఆదిపత్యం కలిగిన నియోజకవర్గం.
నియోజకవర్గంలో సమస్యలు:
@ నెల్లికల్లు లిఫ్ట్ స్కీం పెండింగ్లోనే ఉంది. 25 వేల ఎకరాలకు సంబంధిం చిన ఈ లిఫ్ట్ స్కీం ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సెంటర్ పాయింట్గా మారింది. టెండర్లు పిలుస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు.
@ నందికొండ మున్సిపాలిటీలో సాగర్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ప్రజలకు పర్మినెంట్ హక్కులు కల్పిస్తామని చెప్పారు. దీనికి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేస్తామని చెప్పారు. ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది.
@ పో డు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి సర్వే చేశారు. 25 వందల ఎక రాలకు సంబంధించి సర్వే చేశారు.
@ సాగర్లో గురుకుల కాలేజీని డిగ్రీ కాలే జీగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.
@ హాలియా నియోజకవర్గ అభివృద్ధికి సం బంధించి 150 కోట్లు సీఎం ప్రకటించారు. వీటికి సంబంధించిన ప్రణాళికలు ఇంకా ఫైనల్ కాలేదు.
@ గుర్రంపోడు మండలంలో గుర్రంపోడు లిఫ్ట్ స్కీం స ర్వే చేస్తామని చెప్పారు. ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి కింద ఐదువేల ఎకరాల సాగులోకి వస్తదని చెప్పారు. పెద్దవూర మండలం కుంకుడు చె ట్టు తండా టెండర్లు పి లుస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ జరగలేదు.