రాజేంద్రనగర్ నియోజకవర్గం
నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలాలు: గండిపేట, శంషాబాద్
ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలు; బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ (టీఆర్ఎస్), మణికొండ (కాంగ్రెస్–బీజేపీ), నార్సింగి (టీఆర్ఎస్), బండ్లగూడ (టీఆర్ఎస్). శంషాబాద్ మున్సిపాలిటీ (టీఆర్ఎస్) ఉంది.
జీహెచ్ఎంసీ సర్కిల్లో ఐదు డివిజన్లున్నాయి.. అత్తాపూర్ (బీజేపీ), మైలార్దేవ్పల్లి (బీజేపీ), రాజేంద్రనగర్ (బీజేపీ), శాస్త్రీపురం (ఎంఐఎం), సులేమాన్ నగర్ (ఎంఐఎం)
Rajendranagar Election Results 2018
Candidate Name | Party | Votes |
TOLKANTI PRAKASH GOUD | Telangana Rashtra Samithi | 108964 |
GANESH RENUKUNTLA | Telugu Desam | 50591 |
MIRZA RAHMAT BAIG | All India Majlis-E-Ittehadul Muslimeen | 46547 |
BADDAM BAL REDDY | Bharatiya Janata Party | 19627 |
THOKALA SRINIVAS REDDY | All India Forward Bloc | 13084 |
GANGANI MAHENDER | Bahujan Samaj Party | 1562 |
SRILATHA | Independent | 1023 |
None of the Above | None of the Above | 1729 |
Sitting and Previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | TOLKANTI PRAKASH GOUD | TRS | 108964 | GANESH RENUKUNTLA | TDP | 50591 |
2014 | Tolkanti Prakash Goud | TDP | 77843 | Gnaneshwar | INC | 51962 |
2009 | T.Prakash Goud | TDP | 49522 | Jnaneshwar | INC | 42037 |
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (టీఆర్ఎస్ పార్టీ)
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి 19 మంది పోటీ చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్(ఎమ్మెల్యే), టీడీపీ నుంచి గణేష్ గుప్తా మధ్య పోటీ జరిగింది. మజ్లీస్ నుంచి మీర్జా రహ్మత్ బేగ్, బీజేపీ నుంచి బద్ధం బాల్ రెడ్డి, మైలార్ దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ఫార్వార్డ్ బ్లాక్ నుంచి , ఎన్సీపీ నుంచి డాక్టర్. ఏఎస్ రావు, ఆప్ నుంచి సాధిక్ బిన్ యూసుఫ్, శివసేన నుంచి నర్సింగ్ రావు, పటోళ్ల కార్తీక్ రెడ్డి పోటీ చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ప్రకాశ్ గౌడ్ బలంగా ఉన్నారు. కొంతకాలం ప్రకాశ్‌గౌడ్ బీజేపీకి, లేదా కాంగ్రెస్‌కు వెళుతారనే ప్రచారం జరిగింది. కేటీఆర్ మళ్లీ అభయమివ్వటంతో ఆయనే యాక్టివ్ అయ్యారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి కూడా ఇదే సెగ్మెంట్ పై కన్నేశారు.
నియోజక వర్గంలో ముదిరాజ్, గౌడ ఓటు బ్యాంకు ఎక్కువ. దాదాపు 24 శాతం (లక్షా 20 వేలు) ముస్లిం ఓట్లున్నాయి. ముస్లింల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ ఓట్లను చీల్చేందుకు ప్రకాశ్ గౌడ్ ప్రతి సారీ ముగ్గురు, నలుగురు ముస్లిం అభ్యర్థులను చిన్న పార్టీల నుంచి లేదా ఇండిపెండెంట్లుగా నిలబెడతారు.