తెలుగు సినిమా.. రెండు రీమేక్స్.. ఒక్కరే హీరోయిన్

ఏ సినిమా అయిన ఇంకో భాషలోకి రీమేక్ అవ్వడం కామన్ .. కానీ ఓ సినిమా తెలుగు నుంచి తమిళ్, కన్నడ భాషల్లో రిలీజైతే అందులో ఒకే హీరోయిన్ గా నటించింది. ఇది చాలా రేర్ అనే చెప్పాలి. ఆమె ఎవరో కాదు షహీన్ . ఆ సినిమానే చిరునవ్వుతో తొట్టెంపూడి వేణు హీరోగా, షహీన్ హీరోయిన్ గా నటించిన చిరునవ్వుతో చిత్రం 10 నవంబర్2000లో రిలీజై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించగా, జి.రాంప్రసాద్ దర్శకత్వం వహించారు. ఎస్పీ ఎంటర్టైన్మెంట్ఈ చిత్రాన్ని నిర్మించింది. మణిశర్మ సంగీతం అందించారు.

ఈ సినిమాను 2001లో ప్రేమక్కే సై టైటిల్ తో కన్నడలో రీమేక్ చేశారు. రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు కొదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. హీరోయిన్ గా షహీన్ నే తీసుకున్నారు. అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. చిరునవ్వుతో సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ . అక్కడ కూడా ఈ సినిమా కూడా హిట్ అయింది.

ఇదే సినిమాను 2002 తమిళ్ లో యూత్ టైటిల్ తో రీమేక్ చేశారు. విన్సెంట్ సెల్వ ఈ సినిమాకు డైరెక్షన్ చేయగా స్టార్ హీరో విజయ్ ఈ సినిమాను చాలా ఇష్టంతో చేశారు. హీరోయిన్ గా షహీన్ నే తీసుకున్నారు. మళ్లీ మణిశర్మనే మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుండగా అందులో మూడు పాటలు అన్నయ్య, ఖుషి, చిరునవ్వుతో సినిమాలోని పాటలను ఈ సినిమా కోసం వాడారు.

చిరునవ్వుతో కన్నడ, తమిళ్ లో రీమేక్ అయితే సంధ్య అనే పాత్రను ఒక్క హీరోయిన్ పోషించడం, మణిశర్మ మ్యూజిక్ అందించడం విశేషం.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc