చేవెళ్ల నియోజకవర్గం CHEVELLA (SC)

చేవెళ్ళ ​ నియోజకవర్గం:
(ఎస్సీ రిజర్వ్​డ్​ సెగ్మెంట్​)
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా
మండలాలు;  చేవెళ్ల, షాబాద్​, మొయినాబాద్​, శంకర్​పల్లి, నవాబ్​ పేట   

Chevella (SC) (Telangana)Constituency 2018

Candidate NamePartyVotes
KALE YADAIAHTelangana Rashtra Samithi99168
K.S RATNAMIndian National Congress65616
KANJARLA PRAKASHBharatiya Janata Party5474
KARRE SUNEEL KUMARBahujan Samaj Party1706
RAVINDER MALARepublican Party of India1334
ATHELI NARSIMULUJai Swaraj Party956
G. CHINA MANIKYAMAll India Samata Party560
J BHEEMAIAHIndependent492
UPPARI SRINIVASBahujana Raajyam Party (Phule Ambedkar)422
None of the AboveNone of the Above1469

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018KALE YADAIAHTRS99168K.S RATNAMINC65616
2014Kale YadaiahINC64182Korani Sayanna RatnamTRS63401
2009K.S.RatnamTDP62332Kale YadaiahINC60083
2004Patlolla SabithaINC96995Sama Bhoopal ReddyTDP55410
ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య  (టీఆర్​ఎస్​ పార్టీ)

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యముంది. అప్పటి సీఎం వైఎస్​ హయాంలో పలు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ వేదికగా నిలిచిన ఈ నియోజకవర్గం రాష్ట్రమందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడి నేతలను రాష్ట్రానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది.

 ప్రస్తుతం ఇక్కడ టీఆర్​ ఎస్​ తరఫున గెలుపొందిన కాలె యాదయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో దాదాపు పాతికేళ్లు పటోళ్ల ఇంద్రారెడ్డి కుటుంబం ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గం 2009లో జరిగిన డీలిమిటేషన్​ లో ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా మారింది.

తొలిసారి 2014లో కాంగ్రెస్​ నుంచి గెలిచిన కాలె యాదయ్య గత ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి గెలుపొందారు. కాంగ్రెస్​ అభ్యర్థి కె.ఎస్​.రత్నం  రెండో స్థానంలో,  బీజేపీ అభ్యర్థి  కంజర్ల ప్రకాష్ మూడో స్థానంలో ఉన్నారు.

కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కేఎస్​ రత్నం.. రిజల్ట్స్​ వచ్చిన కొన్నాళ్లకే తిరిగి టీఆర్​ఎస్​ లో చేరారు. కాంగ్రెస్​, బీజేపీకి బలమైన అభ్యర్థులు లేకపోవటం  టీఆర్​ఎస్​కు ప్లస్​ పాయింట్​.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  సబితారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి,  కొడంగల్​ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. వీరంతా నియోజకవర్గానికి బయటి ప్రాంతాల్లో ఉంటున్నప్పటికీ ఈ ప్రాంత రాజకీయాలపై వారి ప్రభావం ఎక్కువ.

నియోజకవర్గ రాజకీయాల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత మండలంలో గట్టి పట్టుంది.  రాజకీయంగా మొదటి నుంచి సబితా ఇంద్రారెడ్డి , పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాల ప్రభావం ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ప్రత్యక్షంగా, పరోక్షంగా వీళ్ల సపోర్ట్​ ఉన్న వాళ్లే ఎన్నికల్లో  గెలుస్తారనే ప్రచారం ఉంది. షాబాద్, చేవెళ్ల మండల టీఆర్​ఎస్​ రాజకీయాల్లో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్​ రెడ్డికి పట్టు ఉంది.

సామాజిక వర్గాలుగా చూస్తే నియోజకవర్గంలో ఎస్సీలు 23.6 శాతం ఉండగా, ఎస్టీలు 1.71 శాతం ఉన్నారు. బీసీల్లో గౌడ, గొల్లకురుమ, ముదిరాజ్​, తెనుగ కులాలకు జనాభా  ఎక్కువ. షాబాద్, నవాబుపేట మండలాల్లో ఎక్కువగా ఎస్సీ  ఓటర్లు ఉండటంతో  నియోజకవర్గాన్ని ఎస్సీకి రిజర్వుడు చేశారు.

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు.. ప్రజల డిమాండ్లు

1. చేవెళ్ల నియోజకవర్గం మీదుగా నిర్మించాల్సిన బీజాపూర్​ – హైదరాబాద్​ హైవే పనులు గత 30 ఏళ్లుగా పెండింగ్​ లో ఉన్నాయి. ప్రతి ఎన్నికల సమయంలోనూ అన్ని పార్టీల నాయకులు ఈ హామీ ఇస్తున్నారు.

2. దివంగత సీఎం వైఎస్​ హయాంలో శంకుస్థాపన చేసిన అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు పెండింగ్​ లో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా చేవెళ్ల ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలని ఆయన భావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్​ తో చేవెళ్ల కు నీళ్లు రాకుండా పోయాయి. దీనికి  ప్రత్యామ్నాయంగా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉద్ధండపూర్​ రిజర్వాయర్​ నుంచి కేపీ లక్ష్మీందేవిపల్లి రిజర్వాయర్​ కు నీళ్లివ్వాలని, అక్కడి నుంచి చేవెళ్లకు నీరందించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ఉద్ధండపూర్​ రిజర్వాయర్​ పనులు మాత్రమే నడుస్తున్నాయి. ఆ తర్వాత చేపట్టాల్సిన మూడు ప్యాకేజీల పనులకు కనీసం టెండర్​ కూడా పిలవలేదు.

3. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మోయినాబాద్,  షాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాలు 111 జీవో పరిధిలోకి వస్తాయి. ఒక్క నవాబుపేట మండలం మాత్రమే ఈ జీఓ పరిధిలో లేదు. 90 శాతం భూమిని వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని, కేవలం 10 శాతం భూమినే నిర్మాణాలకు వాడుకోవచ్చని, పరిశ్రమల స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదనేది ఆ జీవో సారాంశం. ఈ ప్రాంతంలో నిర్మాణాలకు 111 జీఓ అడ్డంకిగా మారింది. అధికారంలోకి వస్తే 111 జీవోను రద్దు చేస్తామని 2018 ఎన్నికల సందర్భంగా జరిగిన ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు.  కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

4. డిగ్రీ కాలేజీ బిల్డింగ్ అసంపూర్తిగా నిలిచిపోయింది.

5. మినీ స్టేడియం నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
6. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మంజూరు చేయలేదు.

7. మెడికల్ కాలేజీ ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు మంజూరు కాలేదు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here