ఆ ఇద్దరు స్టార్ లకు జోడీగా నటించలేకపోయిన విజయశాంతి

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రతి హీరోయిన్ కు స్టార్ హీరోలందరితో నటించాలనే కోరిక ఉంటుంది. అయితే ఆ అదృష్టం అందరికీ రాకపోవచ్చు. ఆ తర్వాత పలనా హీరోతో నటించాలని అనుకున్నాను అంటూ చాలా బాధపడుతుంటారు హీరోయిన్లు. అలాగే ఫీలయ్యారు హీరోయిన్ విజయశాంతి. జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి నటనతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం.

1979లో తొలిసారి కథానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళైన ఎన్టీఆర్,ఏఎన్నార్ లతో జోడిగా నటించేందుకు చాలా మంది హీరోయిన్లు పోటీ పడేవారు.సావిత్రి, జమున, వాణిశ్రీల నుంచి రాధిక, రాధల వరకు వీరితో నటించారు. అయితే రాధిక, రాధలకి పోటీగా నిలిచిన విజయశాంతి మాత్రం ఎన్టీఆర్,ఏఎన్నార్ లతో జోడిగా నటించలేకపోయింది.

కానీ విచిత్ర్రం ఏంటంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు హీరోలుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్యం శివం’ సినిమాలో విజయశాంతి నటించింది. ఇందులో వీరికి చెల్లెలుగా విజయశాంతి కనిపిస్తుంది. ఇక చిరంజీవి హీరోగా వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమాలో ఏఎన్నార్ కి కూతురిగా నటించి మెప్పించింది విజయశాంతి. అటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జోడిగా నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc