మెదక్​ MEDAK

మెదక్ నియోజకవర్గం :

మండలాలు; : మెదక్, హవేలి ఘనపూర్​, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మెదక్ మున్సిపాలిటీ

ఎమ్మెల్యే: పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్ఎస్ పార్టీ)

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్​ఎస్​ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014, 2018 ఎన్నికల్లో రెండు సార్లు వరుసగా పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ పార్టీలో పద్మా దేవేందర్ రెడ్డి తిరుగులేని శక్తిగా ఎదిగారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీకి ఆమె ఆసక్తిగా ఉండగా, ఆమె భర్త దేవేందర్ రెడ్డి కూడా అవకాశం వస్తే పోటీ చేయాలనుకుంటున్నారు.

కొన్నాళ్లుగా హవలి ఘనపూర్​ మండలం కూచన్​పల్లి కి చెందిన ముఖ్య మంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పార్టీ తరపున పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు స్వగ్రామంలో ఫాంహౌస్​ ఏర్పాటు చేసుకుని వీలైనన్ని రోజులు ఇక్కడే ఉంటున్నారు.

 నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటిస్తున్నారు. సీఎంఆర్​ఎఫ్​ ద్వారా ఎక్కువ మందికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ తరపున డీసీసీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్​ రావ్​, టీపీసీసీ ఆర్గనైజింగ్​ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ కూడా కాంగ్రెస్​ టికెట్​ ఆశిస్తున్నారు. బీజేపీలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్​, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​ రెడ్డి ముఖ్య నాయకులు. కొంత కాలంగా శశిధర్​ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మళ్లీ కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

నియోజకవర్గంలో ముదిరాజ్​ కులం ఓటర్లు అధికంగా  ఉన్నారు. ఆ తర్వాత మున్నూరు కాపులు, గౌడ్​లు, ముస్లీం మైనార్టీలు, ఎస్సీలు ఉన్నారు.

 ప్రధాన సమస్యలు:

1). నియోజక వర్గంలో ప్రధాన సాగునీటి వనరైన వనదుర్గా ప్రాజెక్ట్ ఎత్తు పెంపు పనులు  పెండింగ్ లో ఉన్నాయి  2015లో ఆనకట్ట ఎత్తు పెంపు కోసం 44.63 కోట్లు మంజూరు కాగా భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాక ఆరేళ్లుగా పనులు పెండింగ్ లో ఉన్నాయి.

2). వన దుర్గా ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టు పొలాలకు సాగు నీరు అందించేందకు నిర్మించిన మహబూబ్ నహర్, ఫతే నహర్ కాల్వల కు పూర్తి స్థాయిలో సిమెంట్ లైనింగ్ లేక, అధ్వాన్నంగా మారి చివరి ఆయకట్టుకు నీరందడం లేదు.

3). రాష్ట్ర లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రదేశమైన ఏడుపాయల కు. ఏడాది పొడుగునా రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే అక్కడ సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

4). జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో స్పోర్ట్స్ స్టేడియం, ఇండోర్ స్టేడియం ఉన్నా ఒక్క స్పోర్ట్స్ అకాడమీ కూడా లేదు. దీంతో కోట్లు పెట్టీ నిర్మించిన రెండు స్టేడియాలు పూర్తి స్థాయిలో వినియోగించు కొలేని పరిస్తితి ఉంది.

5). జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి బైపాస్ రోడ్డు లేక పోవడం ప్రధాన సమస్యగా ఉంది. హైదరాబాద్, బోధన్, సిద్దిపేట, బీదర్ రూట్లకు వెళ్లేందుకు మెదక్ పట్టణం మీదుగా ఒకే ఒక రోడ్డు ఉంది. పట్టణ పరిధిలో మెయిన్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్స్ జరిగిన, ఏదైనా సమస్య పై రైతులు, ప్రజలు రాస్తారోకో చేసిన ట్రాఫిక్ స్తంభించి ఆయా రూట్లలో రాకపోకలు నిలిచి పోయాయి. బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్డు నిర్మిస్తామన్నా పాలకుల హామీ  ఎన్నెళ్ళయిన అమలుకు  నోచుకోవడం లేదు.

Sitting and previous MLAs

YearWinner Candidates NamePartyVotesRunner UPPartyVotes
2014M.Padma Devender ReddyTRS89654Vijaya Shanthi. MINC50054
2009Mynampalli Hanumanth RaoTDP57942P. Shashidhar ReddyINC36791
2004Patlolla Shashidhar ReddyJP43369Karanam UmadeviTDP38920

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here