నారాయణఖేడ్ నియోజకవర్గం :
మండలాలు; నారాయణఖేడ్, మనూర్, కల్హేర్, కంగ్టి, సిర్గాపూర్, పెద్దశంకరంపేట
ఎమ్మెల్యే: భూపాల్ రెడ్డి (టీఆర్ఎస్)
మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి (కాంగ్రెస్) చనిపోవడంతో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆతర్వాత 2018 జనరల్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.
2018 ఎన్నికల్లో బిజెపి పార్టీ నుంచి డాక్టర్ సంజీవరెడ్డి పోటీచేయగా, అనంతరం సంజీవరెడ్డి పార్టీని వదిలి కాంగ్రెస్ వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే విజయ పాల్ రెడ్డి బిజెపిలో చేరారు. అడపాదడపా పార్టలీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో, రాష్ట్రంలో బిజెపి జోరు పెంచడంతో పలువురు నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు.
వీ6 చానెల్ లో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప బీజేపీలో చేరికతో ఒక్కసారిగా యూత్ లో జోష్ పెరిగింది. ఆయన నారాయణఖేడ్ లో ఎక్కువ శాతం ఓటర్లు ఉన్న లింగాయత్ వర్గం పైన ఫోకస్ పెడుతూ వివిధ వర్గాల యువతను కూడా కార్యక్రమాలు చేయడంలో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త సంగమేశ్వర రెడ్డి కూడా బిజెపిలో చేరి వివిధ మండలాల్లో యువతతో కలిసి బిజెపి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా యువతను ఎంకరేజ్ చేస్తూ బిజెపి పార్టీ కమిట్మెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏది ఏమైనా బిజెపి నుండి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఈసారి పెరుగుతుందనేది వాస్తవం. ఇందుకు అనుగుణంగానే నాయకులు వారి వారి అస్త్రాలను పదును పెడుతున్నారు.
* నారాయణ ఖేడ్ అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయాత్ లు, ఎస్టీలు, ముదిరాజులు ఓటర్లు ప్రభావితం చూపుతారు.
ప్రధాన సమస్యలు:
1). వెనుకబడిన ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అనేక గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు సరిగా లేక ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2). సరైన ఉపాధి అవకాశాలు లేక నియోజకవర్గం నుంచి వేలాది మంది హైద్రాబాద్, ఆర్మూర్ వలసలు వెళ్లారు. ప్రతి క్రషింగ్ సీజన్లో ఇక్కడి తండాల నుంచి వందలాది గిరిజన కుటుంబాలు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తాయి.
3). అనేక గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా అప్ గ్రేడ్ చేసినా అభివృద్ధి జాడ లేదు. సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టు ఉన్నాయి. మౌళిక వసతుల కొరతతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
4). నియోజకవర్గంలో ఉన్నత విద్యకు అవకాశం లేకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ, పీజీ చదువుకునేందుకు సంగారెడ్డి,హైద్రాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
5). ఏరియా హాస్పిటల్ లో సిబ్బంది కొరతతో ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు
6). పేరుకే మున్సిపాలిటీ సదుపాయాలు సున్న సిబ్బంది కొరత. ఉంటది
Sitting and previous MLAs
.Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2014 | Patlolla Kishta Reddy | INC | 62347 | Mahareddy Bhupal Reddy | TRS | 47601 |
2009 | Patlolla Kista Reddy | INC | 68472 | M. Vijayapal Reddy | PRAP | 40799 |