చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు.. తెలంగాణలో వారికి రూ.3 లక్షలు.. భారత్ లో మాంద్యం రానేరాదు.. నేటి టాప్ టెన్ న్యూస్

చిరంజీవికి ఇండియన్​ ఫిల్మ్​ పర్సనాలిటీ అవార్డు

తెలుగు సినిమా హీరో, మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. 2022 సంవత్సరానికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా చిరంజీవి ఎంపికయ్యారు. గోవాలో ఘనంగా ప్రారంభమైన 53వ (IFFI) అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాగూర్ ఈ అవార్డును ప్రకటించారు. గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ప్రారంభమైన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నవంబర్ 28వరకు కొనసాగనున్నాయి. చిరంజీవికి అవార్డు దక్కడంపై ఆయన తమ్ముడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

ఇండియా రేసింగ్​ లీగ్


హైదరాబాద్​ లో జరుగుతున్న ఇండియా కార్​ రేసింగ్​ లీగ్​ అర్ధాంతరంగా నిలిచిపోయింది. తొలి రోజు సాఫీగా జరిగిన టెస్ట్​ రేసులు.. రెండో రోజునే ఆగిపోయాయి. రేసర్లకు వరుస ప్రమాదాలు జరిగాయి. క్వాలిఫయింగ్​ రేసులో కొత్త ట్రాక్​ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. దీంతో లీగ్​ నిర్వహణను ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వరుస ప్రమాదాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో రేస్ రద్దు చేశారు. ఈ అనూహ్య నిర్ణయంతో ఆదివారం వేళ ఇంటర్నేషనల్ ఈవెంట్ చూద్దామని వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

వారికి రూ.3 లక్షలు..


తెలంగాణలో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు అందించే పథకానికి మార్గదర్శాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. తొలుత గ్రామ స్థాయిలో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం రెవెన్యూ బృందం స్థలాలను పరిశీలించనున్నారు. కలెక్టర్ ఫైనల్ చేసిన జాబితాను మంత్రులు లబ్ధిదారులను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.

అడ్డదారులు తొక్కం.. బండి సంజయ్

అధికారంలోకి రావడానికి అడ్డదారులు తొక్కమని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. సిద్ధాంత బలంతో అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.

త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ..


త్వరలో ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఉపాధ్యాయలకు పదోన్నతలు, బదీలు సైతం చేపడతామన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

భారత్ లోకి మాద్యం వస్తుందా?


భారత్ లోకి మాంద్యం వచ్చే అవకాశమే లేదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. వచ్చే ఏడాది దేశ అభివృద్ధి రేటు 6-7 శాతం నమోదు కావొచ్చన్నారు. ప్రపంచం మొత్తం మాద్యం వచ్చినా భారత్ లో అలాంటి పరిస్థితులు రావన్నారు.

యాద్రాద్రికి పోటెత్తిన భక్తజనం


యాదగిరిగుట్ట ఆలయానికి రికార్డుస్థాయి నిత్య ఆదాయం లభించింది. నేడు ఆదివారం ఒక్కరోజే రూ. 1.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఆలయ చరిత్రలో ఇదే అత్యధికమని ఈవో గీతారెడ్డి వెల్లడించారు. స్వామి వారి దర్శనానికి 4గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.

ఇంటర్ ప్రవేశాల గడువు పెంపు:


తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు మరింత గడువు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. విద్యార్థులు ఈ నెల 27 వరకు ఇంటర్ లో అడ్మిషన్ పొందవచ్చని వెల్లడించింది. అయితే.. ఇదే చవరి అవకాశమని బోర్డ్ స్పష్టం చేసింది.

మళ్లీ ట్విట్టర్ లోకి ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మళ్లీ ట్విట్టర్ ఖాతా వచ్చింది. గతంలో రద్దు చేసిన ఆయన ఖాతాను తిరిగి పునరుద్ధరించినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఈ మేరకు దాని కొత్త యజమాని ఎలాన్ మాస్క్ వెల్లడించారు.

ప్రముఖ దర్శకుడు మదన్ కన్నుమూత


తెలుగు సినీ పరిశ్రమలో మరో విశాదం చోటు చేసుకుంది. ప్రమఖ దర్శకుడు మదన్ కన్నుమూశారు. పెళ్లైన కొత్తలో, గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం, గాయత్రి తదితర సినామాలకు ఆయన దర్శకత్వం వహించారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here