ఇప్పుడు టాలీవుడ్ లో ఓట్రెండ్ నడుస్తోంది.. అదేంటంటే రీ రిలీజ్. .ఒకప్పుడు థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను ఇప్పుడు హీరోల బర్త్ డే సందర్భంగా రీరిలిజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మహేష్ బాబు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అయితే ఈ మూడు సినిమాలు ఈ హీరోలకు 7 వ సినిమా కావడం, బ్లా్క్ బాస్టర్ హిట్లుగా నిలవడం జరిగాయి. యాదృశ్చికంగా ఈ స్టార్ హీరోల 7 వ సినిమాలో ఒక్కరే హీరోయిన్ కావడం విశేషం. ఆమెనే భూమిక చావ్లా.
ఒక్కడు : 2003 లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె స్వప్న రెడ్డి అనే పాత్రలో కనిపించింది. సినిమా ప్రారంభమయ్యే నాటికి యువకుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన భూమికను చూసిన గుణశేఖర్ ఆమెను ఫైనల్ చేశారు. 15 జనవరి 2003లో ఈ చిత్రం రిలీజ్ అయింది.
సింహాద్రి : 2003 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్. టి. ఆర్ సరసన భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. ఇందులో భూమిక ఇందు అనే పాత్రలో కనిపించింది 9 జలై 2003లో ఈ చిత్రం రిలీజ్ అయింది.
ఖుషి : 2001లో ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. ఇందులో ఆమె మధుమతి అనే పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు ముందుగా అమీషా పటేల్ ను హీరోయిన్ గా అనుకున్నారు, అయితే అప్పటికే ఆమె బద్రి సినిమాలో నటిస్తు్ండటంతో భూమికను తీసుకున్నారు. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 26న విడుదలైంది.