10న కేబినేట్​ భేటీ.. కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి.. టుడే టాప్​ న్యూస్​

కరోనా చైనా వుహాన్​ ల్యాబ్​లో సృష్టించిందే

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

కరోనా వైరస్ మనిషి సృష్టించిందే అని అమెరికాకు చెందిన సైంటిస్ట్, చైనాలోని వుహాన్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  వైరాలజీ (డబ్ల్యూఐవీ) లో పనిచేసిన ఆండ్ర్యూ హఫ్  అన్నారు. డబ్ల్యూఐవీ ల్యాబ్  నుంచి ఆ వైరస్  లీక్  అయిందని ఆయన ఆరోపించారు. ‘ద ట్రూత్  అబౌట్ వుహాన్’  పేరిట బ్రిటిష్  న్యూస్ పేపర్ ‘ద సన్’ కు హఫ్ రాసిన వ్యాసంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. చైనాలో వైరస్ లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం ఫండింగ్ చేయడమే కరోనా వ్యాప్తికి కారణమైందని ఆరోపించారు. 

గుజరాత్ బీజేపీది.. ఆప్‌కు ఢిల్లీ!

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

గుజరాత్​లోని 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 1న, డిసెంబర్‌ 5న రెండు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం ఎగ్జిట్​ పోల్స్ సర్వే ఫలితాలు రిలీజ్ అయ్యాయి. గుజరాత్​లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అన్ని ప్రముఖ ఎగ్జిట్​పోల్​ సంస్థలు ప్రకటించాయి. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండగా, ఆమ్​ ఆద్మీ పార్టీ మూడో ప్లేస్​కు పరిమితమైనట్టు సర్వేలు వెల్లడించాయి. 182 స్థానాల్లో మ్యాజిక్​ ఫిగర్​ 92 స్థానాలకు పైగా సాధించి బీజేపీయే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్ని సంస్థలు ప్రకటించాయి. 27ఏండ్లుగా గుజరాత్​లో బీజేపీ అధికారంలో ఉంది. సోమవారం జరిగిన ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అత్యధిక స్థానంలో గెలుపొందుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

పదో తేదీన తెలంగాణ క్యాబినేట్ భేటీ

ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం క్యాబినేట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నది. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అంశం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు కూడా డిసెంబర్ రెండో వారంలోనే ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

జీ20 మీటింగ్‌కు కేసీఆర్ డుమ్మా

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కీలక మీటింగ్​లకు సీఎం కేసీఆర్​ వరుసగా గైర్హాజరవుతున్నారు. సోమవారం ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతిభవన్‌లో జరిగిన  జీ-20 సన్నాహక సదస్సు అఖిలపక్ష సమావేశానికి కేసీఆర్ వెళ్లలేదు. సెప్టెంబర్ లో జరగనున్న జి20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సలహాలు, సూచనల కోసం కేంద్రం ఈ భేటీ నిర్వహించింది. ఈ సమావేశానికి 40 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీతో వైరం ఉన్న రాజకీయ పార్టీల అధ్యక్షులు, సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు.  

ఈ నెల 16న కరీంనగర్‌‌కు నడ్డా

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 16 న కరీంనగర్ లో జరుగనున్న బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర  ముగింపు సభకు నడ్డా చీఫ్​గెస్టుగా హాజరుకానున్నారు. కరీంనగర్ ఎస్‌ఆర్‌‌ఆర్‌‌ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో ఈ సభ జరగనుంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో నడ్డా టూర్‌‌ను సక్సెస్ చేయాలని బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

సీబీఐకి కవిత మరో లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసు ఎఫ్‌ఐఆర్‌‌లో తన పేరు ఎక్కడా లేదని, ఈ నెల 6న తనకు వేరే కార్యక్రమాలు ఉన్నందున సీబీఐ ఆఫీసర్లను కలవలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. సోమవారం ఉదయం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం ఢిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు లేఖ పంపించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని క్షుణ్నంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. ఇంతకు ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరో తేదీన తాను సీబీఐ అధికారులను కలువలేకపోతున్నానని తెలిపారు. ఈనెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

కవితకు అరెస్ట్ భయం: సంజయ్

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అరెస్టు చేస్తదని భయం పట్టుకుందని, అందుకే విచారణకు హాజరు కావడం లేదంటూ చెప్పారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అన్నారు. ‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన సీఎం కేసీఆర్ బిడ్డ కవిత.. సీబీఐ విచారణకు హాజరైతే తనను అరెస్టు చేస్తారని భయపడుతోంది. అందుకే తండ్రీబిడ్డ ప్రగతిభవన్ లో కూర్చొని ఏడుస్తున్నారు. సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ఒకవేళ అరెస్టు అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే కుట్ర చేస్తున్నారు” అని ఆరోపించారు.

ఫాంహౌజ్ కేసులో జగ్గుస్వామికి ఊరట

ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో భాగంగా కేరళకు చెందిన జగ్గు కొట్టిలిల్‌ అలియాస్‌ డాక్టర్‌ జగ్గుస్వామికి సిట్‌ జారీ చేసిన నోటీసు అమలును హైకోర్టు నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కేసులో బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎల్‌ సంతోష్‌కు జారీ చేసిన నోటీసు అమలును నిలిపివేస్తూ గతంలోని మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 13 వరకు పొడిగించింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 11ఏ నోటీసు చట్టబద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. అప్పటివరకు 41ఎ నోటీసుతోపాటు లుకౌట్‌ నోటీసులను అమలును కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ కె.సురేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 13కి వాయిదా వేశారు. 

జిల్లాకో వంద మందికి ఎంసెట్ కోచింగ్

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ పూర్తయ్యాక ప్రతి జిల్లాకో వంద మంది స్టూడెంట్లకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం జనవరి, ఫిబ్రవరిలో ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ఎంసెట్ సిలబస్ బోధించాలని అన్ని కాలేజీలకు ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి చివరలో ఎగ్జామ్ నిర్వహించి, మార్కుల ఆధారంగా ప్రతి జిల్లాలో 50 మంది అమ్మాయిలు, 50 మంది అబ్బాయిలను ఎగ్జామ్స్ తర్వాత ప్రారంభమయ్యే ఇంటెన్సీవ్ కోచింగ్ కోసం ఎంపిక చేయాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్లపై బీఎస్పీ ఆందోళనలు

రాష్ట్రంలో బీసీ జనాభాకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని, బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది. బీసీల జనాభా 50 శాతంపైగా ఉన్నా న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కడం లేదని బీసీల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.

‘బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలి’ అనే అంశంపై సోమవారం బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నేతలు, విద్యావేత్తలు హాజరయ్యారు.  రిజర్వేషన్ల శాతం 50 దాటొద్దని ఎక్కడా లేదని, తమిళనాడులో 60 శాతంపైగా రిజర్వేషన్లు ఇస్తున్నాయని తెలంగాణలోనూ రిజర్వేషన్లను పెంచాలని వక్తలు డిమాండ్ చేశారు.

మీ అయ్యా.. నువ్వూ ఒక్కటే: షర్మిల

ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నమని మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు రాసిన లేఖపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గడిచిన 8 ఏండ్లలో 35లక్షల మంది నిరుద్యోగులున్నట్లు టీఎస్  లెక్కలే చెప్తున్నాయని, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం దక్షిణ భారతంలోనే నిరుద్యోగంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందని వైఎస్ షర్మిల సోమవారం ట్వీట్ చేశారు.  “‘వినేటోడు ఎర్రిపప్ప ఐతే చెప్పేటోడు ఎర్రిమాటలు ఎన్నైనా చెప్తాడట’. 80వేల పుస్తకాలు చదివిన మీ అయ్యకు,ఇలాంటి కబుర్లు చెప్పే నీకు సర్కార్ కొలువు ఇయ్యడం అంటే తెలుసా! పని చేస్తునోళ్లను పర్మినెంట్ చేసి, కొత్త ఉద్యోగం అంటారా? 2014 నుంచి మీరిచ్చిన కొలువుల్లో కొత్త నౌకర్లెన్ని? హామీల కంటే ఎక్కువే ఇచ్చినం అనే మీ డ్రామాలకు ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా తక్కువే.  ”అని ఆమె ట్వీట్ చేశారు.

రాహుల్‌తో స్టెప్పులేసిన నేతలు

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

భారత్​ జోడో యాత్రలో భాగంగా ఝలావర్​లో రాహుల్​తో కలిసి రాజస్తాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్ డ్యాన్స్​ చేశారు. ముందు రాహుల్​గాంధీ, కమల్ నాథ్​లు కలిసి డ్యాన్స్​ ప్రారంభించారు.

తర్వాత అశోక్​ గెహ్లాట్​వారితో జతకట్టారు. సచిన్​ పైలట్ కూడా స్టెప్పులు వేయాలంటూ అక్కడే ఉన్న లీడర్లు, కార్యకర్తలు కోరారు. దీంతో సచిన్​ పైలట్​ చేతు పట్టుకుని అశోక్​ గెహ్లాట్ కూడా రాహుల్​తో కలిసి డ్యాన్స్​ చేశారు.

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

కరోనా చైనా ల్యాబ్​లో సృష్టి

 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here