మానుషి చిల్లార్
ప్రియాంక చోప్రా తర్వాత దాదాపు 17ఏళ్ల తర్వాత 2017లో మిస్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకున్నారు. ఇప్పటికీ ఎంతో ఆకర్షణీయమైన టోన్డ్ ఫిజిక్ తో ఉన్నారు.
నికోల్ ఫారియా
ఫిటెస్ట్ బ్యూటీ క్వీన్ లలో నికోలా ఫారియా ఒకరు. 2001లో పోటీలు ప్రారంభమైనప్పట్నుంచి మిస్ ఎర్త్ గా కిరీటం పొందిన మొదటి వ్యక్తి ఫారియా.
దియా మీర్జా
బాలీవుడ్ నటి దియా మీర్జా ఇప్పటికీ డైసీలా తాజాగా కనిపిస్తున్నారు.. దియా మీర్జా 2000లో ఫిలిప్పిన్స్ లోని మనీలాలో మిస్ ఇండియా ఫసిఫిక్ గా కిరీటాన్ని దక్కించుకున్నారు.
ప్రియాంక చోప్రా
స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని సాగిస్తోన్న ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ గెలుచుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లారు. ఇక అప్పట్నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
లారా దత్తా
టెన్నిస్ లెజెండ్ మహేశ్ భూపతిని పెళ్లి చేసుకున్న లారా దత్తా.. ఇప్పుడు ఓ అందమైన కుమార్తెకు తల్లి కూడా. ఇప్పటికీ ఆమె ఫిట్ నెస్ కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నారు.
డయానా హేడెన్
ప్రపంచ సుందరి కిరీటాన్ని భారత్ కు తెచ్చిన మూడో వ్యక్తి దివా డయానా హేడెన్. ఆమె ఎప్పుడూ ఒకే తరహా ఫిట్ నెస్ ను కొనసాగిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఐశ్వర్య రాయ్
అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఐశ్వర్య రాయ్.. ఆమె అద్భుతమైన కళ్లు, టోన్డ్ బాడీ కారణంగా అత్యంత అందంగా కనిపిస్తారు. ఆమెను ఇప్పటికీ చాలా మంది ప్రపంచంలోని అత్యంత అందమైన మహిళగా అభివర్ణిస్తుంటారు.
సుస్మితా సేన్
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఇటీవలే గుండెపోటుకు గురయ్యారు. కానీ ఆమె ఫిట్ నెస్ కోసం అనేక కసరత్తులు చేస్తున్నారు.
జీనత్ ఆమస్
మిస్ ఆసియా ఫసిఫిక్ కిీటాన్ని దక్కించుున్న తొలి భారతీయ సుందరి జీనత్ ఆమన్. ఆమె ఇప్పటికీ తన అందమైన శరీరాకృతితో ఫిట్ గా కనిపిస్తున్నారు.
గుల్ పనాగ్
1999లో మిస్ ఇండియాను గెలుచుకున్న గుల్ పనాగ్.. ఆమె ఫిట్ నెస్ లెవల్స్ కు అందరూ ఫిదా కావల్సిందే. ఆ విషయంలో ఇప్పటికే ఆమె పలువురు చేత ప్రశంసలు అందుకున్నారు.