చాలా మంది చంకలో చమట వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదీ ఈ వేసవిలో ఈ సమస్య మరీ విపరీతంగా ఉంటుంది. దీని వల్ల బైటికి వెళ్లాలన్నా, నలుగురితో సంభాషించాలన్నా కూడా కొన్ని సార్లు ముఖం చాటేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చెమట వల్ల దుస్తులపై పడే మరకలు మురికిగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ అలా బయటకు రాకుండా, ఏ పనీ చేయకుండా ఎలా ఉంటారు. దీనికి పరిష్కారం సమస్యను అధిగమించడమే. అందుకోసం పాటించాల్సిన కొన్ని సులభ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అండర్ ఆర్మ్స్ లో విపరీతమైన చెమట
అండర్ ఆర్మ్స్ లో వచ్చే చెమట వల్ల చాలా మంది అసౌకర్యంగా ఫీలవుతూ ఉంటారు. కాబట్టి ఆ సమస్యను పరిష్కరించుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.
యాంటీ పెర్సెపేరెంట్స్ ప్రయత్నించండి..
ఈ సమస్య ఉన్న వారు ఒకవేళ డియోడరెంటల్ బ్రాండ్లను ప్రయత్నించినా అవి ఫలితాన్ని ఇవ్వకపోతే మీరు వెంటనే యాంటీ ప్రిన్సిపాలిట్లకు మారాలి.
స్నానం చేసిన తర్వాత చర్మాన్ని ఆరబెట్టండి..
స్నానం చేసిన తర్వాత దుస్తులు ధరించే ముందు కొద్దిసేపు వెయిట్ చేయండి. స్నానం చేసిన తర్వాత మీ శరీరం చల్లబరచడానికి, పొడిగా మారడానికి కాస్త సమయం ఇవ్వండి.
మీ చంకలను షేవ్ చేయండి..
సేవింగ్ చేయడం లేదా చంకలలో వెంట్రుకలు కట్ చేయడం ఎప్పుడూ మానేయకండి. ఇది చమటను మరింత తీవ్రంగా చేస్తుంది. ఇది వాసనను కూడా పెంచుతుంది.
వదులు దస్తులను ధరించండి
ఎక్కువ టైట్ గా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అనుకూలమైన బట్టలు ధరించండి. ఇది మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బట్టలపై మరకలు పడుకుండా సహాయపడుతుంది.
చెమటను ప్రేరేపించే ఆహారాన్ని నివారించండి
మీకు ఎక్కువగా చెమట పట్టినట్లయితే ఆహారంపైన కూడా శ్రద్ధ పెట్టండి. అధిక సోడియం, కొవ్వు ఆహారాలు మీకు చెమట పెట్టేలా చేస్తాయి. ఈ వేడి కాలంలో ఉల్లిపాయలతో చేసిన వంటలను నివారిస్తే మంచిది. నిరంతరం హైడ్రేట్ గా ఉంచడానికి అధిక మొత్తంలో నీరు తాగండి.