‘ ప్రేమించుకుందాం రా’ కు ముందు వెంకీ, జయంత్ కాంబోలో సినిమా ఎందుకు ఆగిపోయింది?

వెంకటేష్ హీరోగా అంజల ఝువేరి హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ప్రేమించుకుందాం రా. జయంతి సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1997 మే 09న రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయన్ని అందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్, జయప్రకాష్ విలనిజం, మణిశర్మ అందించిన సంగీతం సినిమాను ఎక్కడికో తీసుకు వెళ్ళాయి.

వాస్తవానికి ఈ సినిమా కంటే ముందు వెంకీ, జయంత్ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ అయి అగిపోయింది. ఇంతకీ అదేంటంటే.. 1993లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న జయంత్ సి పరాన్జీకి దర్శకుడిగా మొదటి అవకాశం ఇస్తానని దర్శకుడు సురేష్ బాబు మాటిచ్చారు. అందులో భాగంగానే ముందుగా ఒక కథ అనుకుని సౌందర్య, మాలాశ్రీ, వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా వెంకటేష్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు.

దీనికి ఏఆర్ రెహమాన్ కు సంగీతం కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తీరా రషెస్ చూసుకున్న జయంత్, సురేష్ లకు ఏదో తేడా కొట్టేసింది. వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత కొన్ని నెలలకు దీనరాజ్ చెప్పిన స్టోరీకి సురేష్ బాబు ప్లా్ట్ అయిపోయారు. దీనికి జయంత్ డైరెక్టర్ అయితే బాగుంటుదని అనిపించి అతనికి కథ వినిపించారు. పరుచూరి బ్రదర్స్ తో కలిసి కూర్చుని మిగితా స్క్రీప్ట్ కంప్లీట్ చేశారు.

ఏఆర్ రెహమాన్ కు బదులు మహేష్ ను తీసుకున్నారు. హీరోయిన్ గా కొత్త అమ్మాయి కావాలని అంజల ఝువేరిని తీసుకున్నారు. అలా ‘ ప్రేమించుకుందాం రా’ సెట్ అయి జయంతి సీ పరాన్జీ దర్శకుడు అయ్యారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here