కొంతమందికి ఏ పని చేయాలన్నా బద్దకం చూపిస్తూ ఉంటారు. చిన్న పనికి సైతం ఇతరులపై ఆధారపడ్తూ అవమానాలపాలవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పని చేయాలనిపించినా సోమరితనం శరీరాన్నంతా వ్యాపించి.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతారు. ఇలా కాన్ని సార్లు అనిపిస్తే పర్లేదు. కానీ ఈ తంతు ప్రతీసారి అదే కొనసాగితే చర్యలకు ఉపక్రమించడం చాలా అవసరం. అందులో ముఖ్యంగా..
గందరగోళం
ఏం చేయాలో నాకు తెలియట్లేదని ఎప్పుడూ విచారించకండి. కొన్ని సొంత్ ట్రిక్స్ తో సమస్యను పరిష్కారం చేసేలా ఆలోచించింది. అది ఒక్కసారే మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కొన్ని విషయాలను తప్పుల నుంచి నేర్చుకోవచ్చు.
ఫిక్సడ్ మైండ్ సెట్
ఏం జరిగినా ఫిక్స్ డ్ మైండ్ సెట్ తో ఉండండి. నేను విఫలమవుతున్నానని, తెలివి తక్కువ వాడిగా కనిపిస్తానని భయపడకండి. స్థిరమైన మనస్తత్వంతో ఎప్పుడూ ఆలోచించండి. ఈ మనస్తత్వమే దీనికి నివారణ.
ఉదాసిీనత
మీరు శ్రద్ధ వహించే వాటిని కనుగొనడం, దానిపై పని చేయడం, వాటిని చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం వంటి చేయండి.
పుస్తక పఠనం
పుస్తకం చదవడం, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ముందు మీ గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అందుకు పుస్తక పఠనం ఉత్తమ మార్గం. దీని వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. తెలియని విషయాలు తెలుసుకోగలుగుతారు. మీరు ఏదైనా పనిని ప్రారంభించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
గుర్తింపు
ఏ పనికైనా తగిన గుర్తింపు రావాలంటే అది వెంటనే రాకపోవచ్చు. కొన్ని పనులకు రోజుల సమయం పడితే.. మరికొన్ని సాధించాలంటే సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ముందు మీరు పనిని ప్రారంభించండి. ఆ తర్వాత సోమరితనం అనేది దానంతట అదే మటుమాయమవుతుంది. చేసే పని మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఆ తర్వాత ఆసక్తి అదంతట అదే వస్తుంది. తప్పక విజయం సాధిస్తారు కూడా.