అందమైన, నిగనిగలాడే చర్మం కోసం చాలా మంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వీలైనన్ని చిట్కాలు, సలహాలు పాటిస్తుంటారు. అలాంటి వారి అందుబాటులో దొరికే, సులభంగా తయారు చేసుకోగలిగే స్పెషల్ డ్రింక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మంచి చర్మం కోసం వీటిని తాగండి
కొన్ని పానియాలు తాగడం వల్ల మీ చర్మం సహజ మెరుపుకు సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా చేయడంలో సహాయపడే పది పానియాలు ఏంటో తెలుసుకుందాం.
నీరు
సరళమైన, అత్యంత అవసరమైన పానీయమైన నీటితో రోజును ప్రారంభించండి. హైడ్రేట్ గా ఉండడం వల్ల మీ శరీరం నుండి టాక్సిన్స్ ను బయటికి పంపడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుందియ ఆరోగ్య కరమైన మెరుపును ప్రోత్సహిస్తుంది.
గ్రీన్ టీ
యాంటీఆక్సిడెంట్ల తో నిండిన గ్రీన్ టీ.. రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. ఇది కొన్ని చర్మ పరిస్థితులకు సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
నిమ్మ నీరు
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తాజా నిమ్మరసం పిండుకొని ఉదయాన్నే తాగండి. నిమ్మ కాయ నీరు జీర్ణ క్రియకు సహాయపడుతుంది. ఆర్ర్థీకరణను పెంచుతుంది, విటమిన్ సిని అధిక మోతాదులో అందిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం కోసం కోల్లా జెన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తుంది.
దోసకాయ నీరు
దోసకాయ ముక్కలతో నీటిని ఇన్ఫ్యూజ్ చేసి తాగడం వల్ల రిఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఆర్ర్థీకరణను అందిస్తుంది. ట్యాక్సిన్సు బయటికి వెళ్లడానికి సహాయపడుతుంది. దోసకాయ హైడ్రేటింగ్ ఉంచి, శర్మాన్ని మృదువుగా చేస్తుంది.
అలోవెరా జ్యూస్
ఇది జీర్ణ క్రియకు సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది. మీ చర్మం ఆరోగ్యానికి, రూపానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
బీట్ రూట్ రసం
బీట్ రూట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు. న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇస్తుంది. రక్త ప్రసరణ చేయడంలో సహాయపడుతుంది, మెరుగుపరుస్తుంది.
పసుపు పాలు
పసుపు యాంటీ ఇన్ ఫ్లమెటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మం అందంగా ఉండడానికి సహాయపడుతుంది, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం టీ
అల్లం టీ డిటాక్సీఫ్లైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మంటను తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన చర్మం కోసం దోహదపడుతుంది.
కొబ్బరి నీరు
కొబ్బరి నీరులో హైడ్రేటింగ్, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి, ఇది టాక్సీన్స్ ను బయటికి పంపడానికి, చర్మం తేమగా మారడానికి, ఆరోగ్యకరమైన ఛాయను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది.
మూలికా కషాయాలు
చమోమిలే, డోoడె లైన్ రూట్, రేగు టీ, హెర్బల్ టీలు నిర్వర్షికరణ ప్రక్రియకు మద్దతునిస్తాయి, వివిధ చర్మ ప్రయోజనాలను అందిస్తాయి.